Telangana: కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి హాజరుకాని ఆ ఎమ్మెల్యే
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా హాజరయ్యారు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో పడిపోవడంతో తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా డిసెంబర్ 9న మిగిలిన పార్టీ శాసనసభ్యులతో కలిసి ప్రమాణం చేయలేకపోయారు.
తెలంగాణ, ఫిబ్రవరి 1: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు కేసీఆర్. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో ప్రమాణం చేశారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స కారణంగా అందరితో పాటు ప్రమాణస్వీకారం చేయలేకపోయిన కేసీఆర్ ఇవాళ ప్రమాణం చేశారు.
కేసీఆర్ రాక సందర్భంగా అసెంబ్లీలో సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి తరలివచ్చారు. కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరుకాకపోవడం చర్చకు దారితీసింది.
ప్రమాణస్వీకార అనంతరం అసెంబ్లీ లాంజ్‌లో దివంగత మాజీ ప్రధాని పి.వి నరసింహారావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు కేసీఆర్. తన క్షేమ సమాచారం అడిగిన అందర్నీ పేరుపేరునా పలకరించారు గులాబీ బాస్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

