'దమ్ముంటే.! చంద్రబాబు ఆధారాలు చూపించాలి.. లేదంటే కేసు పెడతా'..

‘దమ్ముంటే.! చంద్రబాబు ఆధారాలు చూపించాలి.. లేదంటే కేసు పెడతా’..

J Y Nagi Reddy

| Edited By: Ravi Kiran

Updated on: Feb 01, 2024 | 4:52 PM

దమ్ము, ధైర్యముంటే తనపై చేసిన భూకబ్జా ఆరోపణలకు ఆధారాలు చూపాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌కు సవాల్ విసిరారు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.

దమ్ము, ధైర్యముంటే తనపై చేసిన భూకబ్జా ఆరోపణలకు ఆధారాలు చూపాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌కు సవాల్ విసిరారు సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. టైం, డేట్, ప్లేస్ మీరు చెప్పినా ఓకే..? లేదా నన్ను చెప్పమంటారా.? అంటూ ఛాలెంజ్ చేశారు. ప్రతీసారి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటేనంటూ మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలను దర్యాప్తు జరిపించాలని ఎన్నికల కమిషన్‌కు, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తానని కాటసాని రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తప్పు చేసి ఉంటే 1985 నుంచి ఎమ్మెల్యేగా తనను.. ప్రజలు ఎలా గెలిపిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు నిసిగ్గుగా పదేపదే ఆరోపణలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కాటసాని.

Published on: Feb 01, 2024 04:51 PM