Andhra Pradesh: ఐటీ స్కామ్‌లో చంద్రబాబుకు ముడుపులు.. అసెంబ్లీ సాక్షిగా సంచలన వివరాలు వెల్లడించిన సీఎం జగన్..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Mar 24, 2023 | 5:29 PM

Andhra Pradesh: నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సభలో వివరించారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం జగన్.. చంద్రబాబు పాలనలో అవినీతే టార్గెట్‌గా..

Andhra Pradesh: ఐటీ స్కామ్‌లో చంద్రబాబుకు ముడుపులు.. అసెంబ్లీ సాక్షిగా సంచలన వివరాలు వెల్లడించిన సీఎం జగన్..
Cm Jagan
Follow us

నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సభలో వివరించారు. శుక్రవారం నాడు అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం జగన్.. చంద్రబాబు పాలనలో అవినీతే టార్గెట్‌గా సంచలన వివరాలు వెల్లడించారు. షాపూర్జీ పల్లోంజి సంస్థకు రూ. 8 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి రూ.143 కోట్లు వసూలు చేశారన్నారు సీఎం జగన్‌. పల్లోంజి ప్రతినిధిగా మనోజ్‌ వాసుదేవ్, చంద్రబాబు తరపున ప్రతినిధిగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్.. ఈ ఇద్దరి మధ్యవర్తిత్వంతో డబ్బులు చేతులు మారాయని వెల్లడించారు సీఎం జగన్.

షెల్‌ కంపెనీల ద్వారా ఈ నిధులను మళ్లించినట్లు చెప్పారు. దుబాయ్‌లో చంద్రబాబుకి రూ.15 కోట్లు చెల్లింపులు జరిగాయని, మొత్తంగా చంద్రబాబు, టీడీపీకి రూ. 143 కోట్లు చేరాయని ఆరోపించారు సీఎం జగన్. మనోజ్‌, శ్రీనివాస్‌ ఇళ్లలో ఐటీ సోదాల అనంతరం ఇన్విస్టిగేషన్‌ వింగ్‌ అప్రైజల్‌ రిపోర్ట్‌ ఇచ్చిందని, దీని ఆధారంగానే భారీగా డబ్బు చేతులు మారినట్టు గుర్తించారన్నారు సీఎం జగన్. 5 శాతం వసూళ్లు చేసేలా పక్కా ప్లాన్‌ చేశారన్నారు సీఎం జగన్‌. మొత్తం రూ. 2000 కోట్ల స్కామ్ జరిగినట్లు తెలుస్తోందని, ఇప్పటికే శ్రీనివాస్, మనోజ్‌ను విచారించిన ఐటీ శాఖ.. తాజాగా చంద్రబాబుకు కూడా నోటీసులు పంపిందని వెల్లడించారు సీఎం జగన్.

చివరకు హైకోర్టు నిర్మాణంలో కూడా డబ్బులు చేతులు మారాయన్నారు సీఎం జగన్‌. సచివాలయం, అసెంబ్లీ, టిడ్కో హౌసింగ్‌ సహా అన్ని నిర్మాణాల్లో దోపిడీకి పాల్పడ్డారని.. ప్రజాధనం లూటీ అయిందన్నారు సీఎం. దుబాయిలో కూడా దిర్హామ్స్‌ రూపంలో మనీ చేతులు మారినట్టు తెలిపారు. ఐటీ శాఖ కూడా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారన్నారు. ఇటీవల బయటపెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఉన్న వ్యక్తులే ఇందులోనూ ఉన్నారని.. చంద్రబాబు టీమ్‌ అంతా కలిసి దోచుకున్నారని ఆరోపించారు సీఎం జగన్మోహన్‌రెడ్డి.

ఇవి కూడా చదవండి

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలుపగా.. మూడు తీర్మాణాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu