Andhra Pradesh GO.02: సర్పంచులకు గుడ్‌న్యూస్.. జీవో నం.2 వెనక్కు తీసుకున్న ఏపీ సర్కార్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Andhra Pradesh GO.02: సర్పంచులకు గుడ్‌న్యూస్.. జీవో నం.2 వెనక్కు తీసుకున్న ఏపీ సర్కార్!
Go No 2
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 04, 2022 | 5:32 PM

Andhra Pradesh GO.02: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం గతంలో జీవో నెంబర్‌ 2ను ప్రవేశపెట్టింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీ సర్కార్ జారీ చేసింది. అయితే, ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్‌ 2 పంచాయతీ రాజ్‌ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్‌ 2ను సస్పెండ్‌ చేసింది. అయితే దీనిపై మరోసారి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్‌ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది.

అయితే, ఈ జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ జీవో వివరాల్లోకి వెళితే.. సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 2ను తీసుకొచ్చింది. అయితే దీనిపై సర్పంచులు, కార్యదర్శుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ జీవో వలన తమ పదవికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా అవుతుందని గ్రహించిన సర్పంచులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ జీవోపై ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. జీవో నంబర్‌ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది ఏపీ ప్రభుత్వం.

Read Also… PM Modi: త్రిపుర ప్రజలకు మూడు వరాలు ప్రకటించిన ప్రధాని.. పేదరికం, వెనుకబాటుతనానికి త్వరలో విముక్తిః మోడీ

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?