AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESIC Recruitment: విజయవాడ ఈఎస్‌ఐసీ ఆఫీసులో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకు పైగా జీతం పొందే అవకాశం..

ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న ప్రాంతీయ కార్యాలయంలో ఉన్న ఖాళీలను..

ESIC Recruitment: విజయవాడ ఈఎస్‌ఐసీ ఆఫీసులో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకు పైగా జీతం పొందే అవకాశం..
Narender Vaitla
|

Updated on: Jan 04, 2022 | 4:21 PM

Share

ESIC Recruitment: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న ప్రాంతీయ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ)–07, స్టెనోగ్రాఫర్‌–02, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)–26 ఖాళీలు ఉన్నాయి.

* ఎంటీఎస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి/తత్సమాన, స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు యూడీసీ, స్టెనో పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను మొదట ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు యూడీసీ, స్టెనో పోస్టులకు పే లెవల్‌–4 ప్రకారం రూ.25,500 నుంచి రూ.81,100, ఎంటీఎస్‌ పోస్టులకు పే లెవల్‌–1 ప్రకారం 18,800 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 15-01-2022న ప్రారంభమవుతుండగా, చివరి తేదీగా 15-02-2022ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: PM Kisan: రైతులకు ప్రభుత్వం హెచ్చరిక.. పీఎం కిసాన్‌ డబ్బులు దొంగిలిస్తున్నారు జాగ్రత్త..?

Hair Care Tips: శీతాకాలంలో అందమైన కురులు కావాలంటే ఇలా చేయండి.. ఎలాంటి చిక్కులైనా..

పెరుగుతున్న కేసులు !! లాక్ డౌన్ తప్పదా !! లైవ్ వీడియో

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!