AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు ప్రభుత్వం హెచ్చరిక.. పీఎం కిసాన్‌ డబ్బులు దొంగిలిస్తున్నారు జాగ్రత్త..?

PM Kisan: రైతులను ప్రభుత్వం హెచ్చరించింది. పీఎం కిసాన్‌ డబ్బులు దొంగిలిస్తున్నారని ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఎటువంటి O

PM Kisan: రైతులకు ప్రభుత్వం హెచ్చరిక.. పీఎం కిసాన్‌ డబ్బులు దొంగిలిస్తున్నారు జాగ్రత్త..?
Pm Kisan Samman Nidhi Yojan
uppula Raju
|

Updated on: Jan 04, 2022 | 2:48 PM

Share

PM Kisan: రైతులను ప్రభుత్వం హెచ్చరించింది. పీఎం కిసాన్‌ డబ్బులు దొంగిలిస్తున్నారని ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఎటువంటి OTPలకు, మెస్సేజ్‌లకి, ఈ మెయిల్స్‌కి సమాధానం ఇవ్వొద్దని సూచించింది. పీఎం కిసాన్‌ పథకం కింద డబ్బులు అకౌంట్లో పడిన వెంటనే సైబర్‌ నేరస్థులు వేగంగా లబ్దిదారులకు ఫేక్ మెస్సేజ్‌లు, OTPలు, బ్యాంకు హెచ్చరికలకు సంబంధించిన సందేశాలు పంపుతున్నారని పేర్కొంది. అమాయక రైతుల మొబైల్‌లకు కాల్ చేయడం లేదా వారికి బెదిరింపు సందేశాలు పంపడం ద్వారా వారి ఖాతా నుంచి డబ్బు కాజేస్తున్నారని పేర్కొంది. అందువల్ల రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని సర్క్యూలర్ జారీ చేసింది. అనేక రాష్ట్రాల్లో రైతులు ఈ విధంగానే మోసపోతున్నారని పేర్కొంది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు పీఎం కిసాన్‌ పథకం కింద డబ్బులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇలా డబ్బులు దోచుకుంటున్నారు.. సైబర్ కేటుగాళ్లు సాధారణంగా కస్టమర్ల మొబైల్‌కి ఈమెయిల్‌లు, కాల్‌లు లేదా SMSలు పంపుతారని సైబర్ కేసుల నిపుణులు చెబుతున్నారు. ఈ మెస్సేజ్‌లు ఆకర్షణీయమైన ఆఫర్‌లు లేదా బ్యాంకు అకౌంట్‌ క్లోజ్‌ అవుతుందని భయపెట్టే విధంగా కానీ ఉంటాయి. తద్వారా సామాన్యుడు తన వ్యక్తిగత సమాచారాన్ని వారికి షేర్ చేస్తాడు. ఇలా చేయడం ద్వారా సైబర్‌ కేటుగాళ్లు వారి ఖాతా నుంచి డబ్బు దొంగిలిస్తున్నారు. రైతుల విషయంలోనూ ఇదే జరుగుతోంది.

ఇలా నివారించండి మీ బ్యాంక్ వివరాలను అడిగే ఈమెయిల్‌లు, సందేశాలకు ప్రతిస్పందించవద్దు. ఆకర్షణీయమైన కమీషన్ ఆఫర్‌ల బారిన పడవద్దు. ఏదైనా అనధికార డబ్బును మీ ఖాతాలోకి తీసుకోవడానికి అంగీకరించవద్దు. ఖాతాదారుల బ్యాంకు ఖాతాలు లేదా ఏటీఎంల గురించిన సమాచారం ఏ బ్యాంకు అధికారి అడగరని గుర్తుంచుకోండి.

బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు చోరీకి గురైతే ఏం చేయాలి మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు చోరికి గురైతే మూడు రోజుల్లో ఈ విషయం గురించి బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తే మీరు ఈ నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కస్టమర్ ఖాతా నుంచి మోసపూరితంగా విత్‌డ్రా చేయబడిన మొత్తాన్ని నిర్ణీత గడువులోగా బ్యాంకుకు తెలియజేసినప్పుడు 10 రోజుల్లోపు అతని బ్యాంక్ ఖాతాకు ఆ సొమ్ము తిరిగి వస్తుందని RBI తెలిపింది.

ఒకవేళ మోసం జరిగినట్లు 4 నుంచి 7 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే అప్పుడు వినియోగదారుడు రూ. 25,000 వరకు నష్టాన్ని భరించవలసి ఉంటుందని RBI పేర్కొంది. బ్యాంకు ఖాతా ప్రాథమిక సేవింగ్స్ బ్యాంకింగ్ డిపాజిట్ ఖాతా అంటే జీరో బ్యాలెన్స్ ఖాతా అయితే మీ బాధ్యత రూ. 5000 అవుతుంది. అంటే మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 10,000 అనధికార లావాదేవీ జరిగితే, మీరు బ్యాంకు నుంచి కేవలం రూ. 5000 మాత్రమే తిరిగి పొందుతారు. మిగిలిన 5000 రూపాయల నష్టాన్ని మీరు భరించాలి. ఒకవేళ మీకు సేవింగ్స్ ఖాతా ఆ ఖాతా నుంచి అనధికారిక లావాదేవీలు జరిగినట్లయితే మీ బాధ్యత రూ. 10000 అవుతుంది. అంటే, మీ ఖాతా నుంచి రూ. 20,000 అనధికార లావాదేవీ జరిగినట్లయితే మీరు బ్యాంకు నుంచి కేవలం రూ. 10,000 మాత్రమే తిరిగి పొందుతారు. మిగిలిన రూ.10,000 నష్టాన్ని మీరు భరించాలి.

MIdhani Recruitment: హైదరాబాద్‌ మిధానీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Sriharikota Covid: షార్‌లో కరోనా కలకలం..12 మందికి కరోనా నిర్ధారణ.. భయాందోళనలో ఉద్యోగులు..

Hair Care Tips: శీతాకాలంలో అందమైన కురులు కావాలంటే ఇలా చేయండి.. ఎలాంటి చిక్కులైనా..