Unemployment: కరోనా ఎఫెక్ట్‌.. దేశంలో పెరిగిన నిరుద్యోగిత.. 2021 గణాంకాలు ఇలా ఉన్నాయి..?

Unemployment: కరోనా ఎఫెక్ట్‌.. దేశంలో పెరిగిన నిరుద్యోగిత.. 2021 గణాంకాలు ఇలా ఉన్నాయి..?
Unemployment

Unemployment: దేశంలో అత్యంత ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభానికి ముందే దేశంలో నిరుద్యోగ రేటు వేగంగా పెరగడం

uppula Raju

|

Jan 04, 2022 | 3:20 PM

Unemployment: దేశంలో అత్యంత ముఖ్యమైన సమస్య నిరుద్యోగం. కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభానికి ముందే దేశంలో నిరుద్యోగ రేటు వేగంగా పెరగడం ప్రారంభమైంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) విడుదల చేసిన డేటా ప్రకారం.. నిరుద్యోగిత రేటు డిసెంబర్ 2021లో ఐదు నెలల గరిష్ట స్థాయి 7.91 శాతానికి పెరిగింది. డిసెంబర్ 2021లో నిరుద్యోగిత రేటు 7.91 శాతానికి పెరిగింది. నవంబర్ నెలలో ఈ రేటు 7 శాతంగా ఉంది. అదే సమయంలో ఆగస్టు నెలలో నిరుద్యోగం రేటు 8.3 శాతం. అంటే ఆగస్టు 2021 తర్వాత ఇదే అత్యధికం.

నగరాల్లో పెరుగుతున్న నిరుద్యోగం దేశంలో నిరుద్యోగం పెరుగుతుండడం కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. ముఖ్యంగా నగరాల్లో నిరుద్యోగిత రేటు 9.30 శాతానికి చేరుకుంది. రోజురోజుకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు ఉద్యోగాల కోసం వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయో ఈ గణాంకాలే చెబుతున్నాయి. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు డిసెంబర్ 2021లో 7.28 శాతంగా ఉంది. ఆగస్టు నెలలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7.64 శాతంగా ఉంది.

హర్యానాలో అత్యధిక నిరుద్యోగిత రేటు కరోనా వైరస్ కారణంగా చాలామంది ఉపాధిని కోల్పోయారు. రాష్ట్రాల ప్రకారం నిరుద్యోగం రేటు చూస్తే హర్యానాలో డిసెంబర్ నెలలో అత్యధిక నిరుద్యోగిత రేటు నమోదైంది. నిజానికి ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలో నిరుద్యోగిత రేటు 34.1 శాతంగా నమోదైంది. అదే సమయంలో, మహారాష్ట్రలో అత్యల్ప నిరుద్యోగ రేటు ఉంది. ఇది 3.8 శాతం. అదే సమయంలో బీహార్‌లో నిరుద్యోగం రేటు 16 శాతం, జార్ఖండ్‌లో 17.3 శాతం, రాజధాని ఢిల్లీలో నిరుద్యోగ రేటు 9.8 శాతంగా నమోదైంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ వ్యాస్ ప్రకారం.. డిసెంబర్ 2021లో ఉపాధి పెరిగింది అయితే ఉద్యోగార్ధుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉంది.

PM Kisan: రైతులకు ప్రభుత్వం హెచ్చరిక.. పీఎం కిసాన్‌ డబ్బులు దొంగిలిస్తున్నారు జాగ్రత్త..?

Smartphone Under 20K: కొత్త ఏడాదిలో కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.? రూ. 20 వేల లోపు ఉన్న బెస్ట్‌ ఫోన్స్‌ ఇవే..

MIdhani Recruitment: హైదరాబాద్‌ మిధానీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu