తక్కువ భూమి, తక్కువ పెట్టుబడి కానీ అధిక రాబడి..! కేంద్ర మంత్రి ఏం చెబుతున్నాడంటే..?

Flower Farming: రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు పూల సాగు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

తక్కువ భూమి, తక్కువ పెట్టుబడి కానీ అధిక రాబడి..! కేంద్ర మంత్రి ఏం చెబుతున్నాడంటే..?
Flower Farming
Follow us
uppula Raju

|

Updated on: Jan 04, 2022 | 4:04 PM

Flower Farming: రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు పూల సాగు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. తక్కువ భూమి, తక్కువ పెట్టుబడి కానీ రాబడి అధికంగా ఉంటుందన్నారు. పూలసాగుని ఎక్కువ మంది రైతులు స్వీకరించాలని పేర్కొన్నారు. పూణెలోని ఇండియన్ ఫ్లోరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో మౌలిక సదుపాయాల కోసం ఆయన ప్రయోగశాల భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ సంప్రదాయాలు, మత-సామాజిక-రాజకీయ అంశాల ప్రకారం పువ్వుల అవసరం ఇప్పటికీ ఉందని తోమర్ అన్నారు. ఎగుమతి కోణం నుంచి చూసినా పూల వ్యాపారంలో చాలా స్కోప్ ఉందన్నారు. మన దేశ వాతావరణం చాలా గొప్పదని, పూల పెంపకానికి అనువైనదని తెలిపారు. రైతులు సకాలంలో మార్కెట్‌కి పూలని అందించి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక పథకాలు రూపొందించారని తోమర్ గుర్తు చేశారు.

దీంతో పాటు రైతులు సాంకేతికంగా కూడా దృఢంగా ఉండాలని, పూల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. మన దేశ వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ ప్రమాణాలతో ఉండాలని సూచించారు. యువత వ్యవసాయం వైపు ఆకర్షితులయ్యే విధంగా సాగు అభివృద్ది ఉండాలని, దీనివల్ల కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని చెప్పారు. కొత్త రకాల పువ్వులను అభివృద్ధి చేస్తూ, సువాసన తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) శాస్త్రవేత్తలు మెరుగైన రకాలు, సాంకేతికతలను అభివృద్ధి చేసినందుకు వారిని అభినందించారు.

Talibans: ఇదేం రాక్షస పాలనరా బాబు.. బొమ్మల తలలను నరికేస్తున్న తాలిబన్లు.. వైరల్‌ అవుతోన్న వీడియో..

Lift Accident: సిద్ధిపేట జిల్లాలో తెగిపడ్డ ఆర్‌వీఎం ఆసుపత్రి లిఫ్టు.. 20మందికి గాయాలు, ముగ్గురికి సీరియస్!

Kriti Shetty: సినిమా సినిమాకు చేంజ్ చూపిస్తానంటున్న పంచదార చిలక.. కృతికి అలాంటి పాత్ర చేయాలనుందట