AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆటోపై తెగి పడిన హైటెన్షన్ వైర్.. 5 మంది సజీవ దహనం..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై హెటెన్షన్ వైర్లు

Andhra Pradesh: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆటోపై తెగి పడిన హైటెన్షన్ వైర్.. 5 మంది సజీవ దహనం..
Power Supply Wires
Shiva Prajapati
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 30, 2022 | 9:45 PM

Share

Andhra Pradesh:అధికారుల నిర్లక్ష్యం- అనుకోకుండా వచ్చిన ఉడుత ఐదుగురి ప్రాణాలు తీసింది. సత్యసాయి జిల్లాలో విషాదం నింపింది. కూలీలపై వెళుతున్న ఆటోపై కరెంట్‌ తీగలు పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఐదుగురు మహిళలు సజీదహనమయ్యారు. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10లక్షల సాయం ప్రకటించారు.అటు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు ASPDCL సిఎండి హరనాథ్ రావు. మృతులకు 5 లక్షలు క్షతగాత్రులకు 2 లక్షల రూపాయలు తక్షణ ఆర్థిక సాయం అందిస్తామన్నారు. మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈకి ఆదేశాలు జారీ చేశారు. ఆటో బాధితులను ఆదుకోవాలని కుటుంసభ్యులు ధర్నాకు దిగారు. న్యాయం చేసేవరకూ కదిలేది అంటూ నిరసన చేపట్టారు. బాధితులకు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ మద్దతు తెలిపారు. వారితో పాటు ధర్నాలో కూర్చున్నారు.

తాడిమర్రి మండలం గుండంపల్లి, పెద్దకోట్లకు చెందిన ఏడుగురు మహిళా కూలీలు పొలం పనులు కోసం చిల్లకొండయ్యపల్లికి ఆటోలో వెళుతున్నారు. మార్గమధ్యలో కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటలు చెలరేగడానికి కారణమేంటి? వైర్లు ఎలా తెగాయి? అనేది ప్రశ్నగా మారింది, అయితే విద్యుత్‌ అధికారులు మాత్రం ఆటో ప్రమాదానికి ఉడుత కారణమంటున్నారు. కరెంట్‌ వైర్లు తెగిన సమయంలో ఉడుత వాటిపై నుంచి ఆటోపై పడిందని.. ఆటోపై ఉన్న గుడారంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో ఆటో మొత్తం అంటుకుంటుదని అంటున్నారు. లోపల ఉన్న మహిళలు ఐదుగురు సజీవదహనమయ్యారు. తాము వచ్చేవరకూ ఆటో మంటల్లో చిక్కుకుందని అంటున్నారు ప్రత్యక్షసాక్షులు. కరెంట్‌ వైర్‌ తెగి ఆటోపై పడిందని చెబుతున్నారు. తాము చూసేవరకూ తీగలపైనే ఊడుత ఉందని వివరిస్తున్నారు.

ఉడుత వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వివరిస్తున్నారు. ఇంతకుముందు కూడా తాము చూశామని చెబుతున్నారు. ప్రమాద టైమ్‌లో ఆటోలో ఏడుగురుఉన్నారు. డ్రైవర్‌తో పాటు మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటోలోపల ఉన్న ఐదుగురు మంటలు అంటుకోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..