Prakasam Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 20 మందికి గాయాలు..
రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వ్యక్తిని తప్పించబోయి.. బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాకింగ్ చేస్తున్న వ్యక్తి బస్సు కింద పడి మృతిచెందాడు.
Prakasam road accident: ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలో ప్రైవేట్ బస్సు – లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వ్యక్తిని తప్పించబోయి.. బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాకింగ్ చేస్తున్న వ్యక్తి బస్సు కింద పడి మృతిచెందాడు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బాధితులను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీని ఢీకొని బస్సు అడ్డంగా పడడంతో జాతీయ రహదారిపై ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
బస్సును అధికారులు క్రేన్ సహాయంలో తొలగిస్తున్నారు. బస్సు విజయవాడ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ఘటన జరగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..