Pumpkin Juice: గుమ్మడికాయ రసంతో ఆ సమస్యలన్నీ మటాష్.. ఇంకా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
గుమ్మడికాయ జ్యూస్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా అలసట, నీరసాన్ని కూడా దూరంచేస్తుంది. గుమ్మడికాయ రసంలో ఉండే విటమిన్ డి, కాపర్, ఐరన్, ఫాస్పరస్ శరీరానికి మరిన్ని పోషకాలను అందిస్తాయి.
Pumpkin Juice Benefits: గుమ్మడికాయలో చాలా పోషకాలు దాగున్నాయి. గుమ్మడికాయ వినియోగం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే గుమ్మడికాయ ప్రయోజనాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గుమ్మడికాయను ఏ విధంగా తీసుకున్న ఆరోగ్యాన్ని మంచి చేకూరుతుంది. గుమ్మడికాయ గింజలు కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుమ్మడికాయ జ్యూస్ కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా అలసట, నీరసాన్ని కూడా దూరంచేస్తుంది. గుమ్మడికాయ రసంలో ఉండే విటమిన్ డి, కాపర్, ఐరన్, ఫాస్పరస్ శరీరానికి మరిన్ని పోషకాలను అందిస్తాయి. ఇది మాత్రమే కాదు విటమిన్ B1, B2, B6 C, E, బీటా-కెరోటిన్ కూడా గుమ్మడికాయ రసంలో ఉంటుంది. గుమ్మడికాయ రసాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..
మలబద్ధకం: మలబద్ధకం సమస్య ఉన్నట్లయితే గుమ్మడికాయ రసాన్ని తీసుకోవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం, అల్సర్, గ్యాస్‌ను నయం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాదు దీని రసం మూత్ర వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.
నిద్రలేమి: సరిగా నిద్రపట్టని వారు.. మంచిగా నిద్రించేందుకు గుమ్మడికాయ రసం తీసుకోండి. దీని కారణంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నిద్రలేమిని కూడా దూరం చేయడంలో సహాయపడుతుంది. గుమ్మడికాయ రసంలో తేనె కలిపి తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
జుట్టుకు బలం: గుమ్మడి రసం జుట్టుకు బలం చేకూరుస్తుంది. జుట్టు రాలడం లాంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గుమ్మడికాయ రసం తీసుకోండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం సమస్యను దూరం చేయడమే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది. గుమ్మడికాయ రసంలో పొటాషియం పుష్కలంగా ఉంది. దీని కారణంగా కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..