Alcohol: మద్యం తాగేటప్పుడు ఈ 5 పదార్ధాలు అస్సలు తినకూడదు.. తింటే డేంజర్‌లో పడినట్లే!

ఆల్కహాల్ తాగేటప్పుడు సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు ఖాళీ కడుపుతో..

Alcohol: మద్యం తాగేటప్పుడు ఈ 5 పదార్ధాలు అస్సలు తినకూడదు.. తింటే డేంజర్‌లో పడినట్లే!
Alcohol
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 29, 2022 | 12:49 PM

సాధారణంగా చాలామంది మద్యం సేవించేటప్పుడు.. దాని టేస్ట్‌కు తగ్గట్టుగా స్పైసీ ఫుడ్‌ను మంచింగ్‌ కోసం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఆల్కహాల్ తాగేటప్పుడు సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకున్నా కూడా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాంటప్పుడు మద్యం సేవించేటప్పుడు.. ఏయే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బీన్స్ లేదా కాయధాన్యాలు:

ఆల్కహాల్ తాగేటప్పుడు.. మీరు కచ్చితంగా బీన్స్, కాయధాన్యాలకు దూరంగా ఉండాలి. బీన్స్, లెంటిల్‌లో ఐరన్ అధికంగా ఉంటుంది. వైన్‌తో కలిపి వీటిని తీసుకున్నప్పుడు.. మీ శరీరానికి తగిన మోతాదులో ఐరన్ లభించదు.

బ్రెడ్:

బీర్‌తో పాటు బ్రెడ్‌ను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే.. సహజంగానే బీర్ తాగిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. బీర్, బ్రెడ్‌లో ఈస్ట్ ఎక్కువ శాతంలో ఉంటుంది. రెండు కలిపి తీసుకుంటే.. దాన్ని కడుపు తొందరగా జీర్ణం చేసుకోలేదు. ఫలితంగా జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.

ఇవి కూడా చదవండి

ఫ్రెంచ్ ఫ్రైస్:

మద్యం సేవించేటప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి స్పైసీ ఫుడ్‌ను దూరం పెట్టాలి. ఇందులో ఎక్కువగా సోడియం ఉంటుంది. మద్యంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్‌ను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

చాక్లెట్:

ఆల్కహాల్ తాగేటప్పుడు లేదా తాగిన తర్వాత చాక్లెట్ తినొద్దు. చాక్లెట్‌లో కెఫిన్, కొవ్వు, కోకో పదార్థాలు ఎక్కువ. ఇతర ఆమ్లా ఆహారాల మాదిరిగా ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు కలుగుతాయి.

పిజ్జా:

ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పిజ్జా తీసుకోవద్దు. ఇందులో పిజ్జాలోని ఆమ్లా టమోటా GERD, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట సమస్యలను కలిగిస్తుంది. టమోటాలు లేకుండా ఏదైనా ఇతర పిజ్జా తినవచ్చు.