Nandyal: ఎగువ అహోబిలం వద్ద ఎలుబంటి కలకలం.. భయాందోళనలో భక్తులు.. సెల్‌కు పనిచెప్పిన కొందరు..

నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. ఎగువ అహోబిలం లో ఎలుగుబంటి సంచారంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.

Nandyal: ఎగువ అహోబిలం వద్ద ఎలుబంటి కలకలం.. భయాందోళనలో భక్తులు.. సెల్‌కు పనిచెప్పిన కొందరు..
Bear Hulchul
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2022 | 8:33 AM

Nandyal District: ఆంధప్రదేశ్ లో(Andhrapradesh) అడవుల్లో నివసించే జంతువులు జనావాసాల బారిన పడుతున్నాయి. పులులు (Tiger), ఎలుగుబంట్లు (Bears), కొండచిలువలు వంటివి గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పులి, ఎలుగుబంటి సంచరిస్తున్నాయన్న సంగతి తెలిసిందే.. తాజాగా నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎగువ అహోబిలం లో ఎలుగుబంటి సంచారంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.

పావన నరసింహస్వామి ఆలయానికి వెళ్లే దారిలో  ఎలుగుబంటి రోడ్డు పై సంచరింస్తూ.. భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన భక్తులు అక్కడే అది వెళ్లే వరకు ఆగిపోయారు. మరికొందరు తమ సెల్ ఫోన్లకు పని చెబుతూ.. ఎలుగుబంటి వీడియోలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..