AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వైసీపీ కేడర్‌కి సీఎం జగన్ కొత్త టాస్క్‌.. జగనన్న సురక్ష పేరుతో సరికొత్త కార్యక్రమం..

ఏడాది పూర్తి చేసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వంపై సీఎం జగన్‌ బుధవారం నాడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు పాల్గొంటారు. అయితే, ఈ సమావేశంలోనే నేతలకు కొత్త టాస్క్ ఇవ్వనున్నారు.

Andhra Pradesh: వైసీపీ కేడర్‌కి సీఎం జగన్ కొత్త టాస్క్‌.. జగనన్న సురక్ష పేరుతో సరికొత్త కార్యక్రమం..
CM Jagan
Shiva Prajapati
|

Updated on: Jun 21, 2023 | 10:21 AM

Share

ఏడాది పూర్తి చేసుకున్న గడపగడపకూ మన ప్రభుత్వంపై సీఎం జగన్‌ బుధవారం నాడు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు పాల్గొంటారు. అయితే, ఈ సమావేశంలోనే నేతలకు కొత్త టాస్క్ ఇవ్వనున్నారు. అదే ‘జగనన్న సురక్ష’. ఈ కార్యక్రమంపైనా నేతలతో వర్క్‌షాప్ నిర్వహిస్తారు సీఎం జగన్. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకువస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జూన్‌ 23వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న జగనున్న సురక్షా కార్యక్రమంలో ప్రతీ గడపకు వెళ్లి వారి సమస్యను తెలుసుకోవడమే లక్ష్యంగా పెట్టారు. పథకాల అమలు, సర్టిపికెట్ల జారీలో జాప్యం వంటి వాటిపై ఫోకస్ పెట్టనున్నారు. ఆ సమస్యలకు సత్వర పరిష్కారం చూపించడమే జగనన్న సురక్ష కార్యక్రమం లక్ష్యం. పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వ తేదీన వాటిని మంజూరు చేయనున్నారు. ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా సీఎం జగన్ సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. పనిలో పనిగా ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్‌పైన కూడా సీఎం జగన్ రివ్యూ నిర్వహించనున్నారు. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకకు వర్క్‌షాప్‌లోనే గైడెన్స్ ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..