CM Jagan: నేడు కడపలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా కడపలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 8,9,10వ తేదీల్లో కడప జిల్లాల్లో సీఎం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తొలి రోజు వైఎస్సార్ జయంతి సందర్భంగా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పర్యటనలో భాగంగా కడపలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 8,9,10వ తేదీల్లో కడప జిల్లాల్లో సీఎం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తొలి రోజు వైఎస్సార్ జయంతి సందర్భంగా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఆదివారం రెండో రోజు పర్యటన కొనసాగనుంది.
ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్ ద్వారా గండికోట చేరుకోనున్నారు సీఎం. ఒబెరాయ్ హోటల్ సంస్థ గండికోటలో ఏర్పాటు చేయనున్న 5 స్టార్ హోటల్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే విశాఖలోని భీమిలీలో ఒబెరాయ్ హోటల్ నిర్మించే సెవెన్ స్టార్ హోటల్‌కు వర్చువల్‌గా సీఎం శంకుస్దాపన చేస్తారు. అనంతరం జగన్ గండికోట వ్యూ పాయింట్‌ను సందర్శించనున్నారు. తర్వాత గండికోట నుంచి బయల్దేరి పులివెందులలోని భాకరాపురానికి వెళ్తారు. పులివెందులలో ఏర్పాటు చేసే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పులివెందుల కొత్త మున్సి పల్ కార్యాలయ భవన ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
రాణితోపు వద్ద అటవీశాఖ అధికారులు నిర్మించిన పులివెందుల నగరవనం ప్రారంభోత్సవంతో పాటు గరండాల రివర్ ఫ్రంట్‌లో గుండాల కెనాల్ డెవలప్మెంట్ మొదటి దశ పనులకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత వైఎస్సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తారు. న్యూటెక్ బయోసైన్స్, ఏపీ కార్ల్ లో ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యాహ్నం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో విరామం తీసుకున్నారు. అనంతరం వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమిని ప్రారంభిస్తారు. అనంతరం భాకరాపురం హెలిపాడ్ చేరుకుని ఇడుపులపాయల చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..