Devineni Uma: ‘ఎన్నికల లోపే నన్ను చంపేయచ్చు’.. కలకలం రేపుతున్న దేవినేని ఉమా వ్యాఖ్యలు..
Krishna District: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాకు ప్రాణహాని ఉందా.. ? ఆయనపై ఎలాంటి దాడులు జరిగాయి. ప్రాణహాని గురించి ఉమామహేశ్వరరావు ఏం చెప్తున్నారు?
Krishna District: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. తనను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. ఎప్పుడైనా తుదముట్టించవచ్చంటూ దేవినేని ఉమా కీలక కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్రలో దేవినేని ఉమా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికల లోపే నన్ను ఎప్పుడైనా చంపేయచ్చు. నాపై చాలా కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు చావు అంచుల వరకు వెళ్లివచ్చా. చంద్రబాబు పాలనతో చేసిన మంచి పనులే ఇప్పటివరకు కాపాడాయి. తాను ప్రయాణించే పడవ మునిగినప్పుడు గోదారితల్లే తనను బతికించింది’ అని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.
అయితే దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. తన ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీరు నాగార్జున సాగర్ కాలువల్లో పారిస్తానని శపధం చేశారు దేవినేని ఉమా. మాజీ మంత్రి వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు టీడీపీ కార్యకర్తలు. దేవినేని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..