- Telugu News Photo Gallery Spiritual photos Follow these vastu tips related to your car to avoid Misfortune
Vastu Tips: కారు విషయంలో ఈ వాస్తు నియమాలను పాటించండి.. చక్కని ఫలితాలు ఉంటాయి.. !
Vastu Tips for Car: మానవ జీవితంలో వాస్తు ఎంత ప్రముఖమైనదో మనందరకీ తెలుసు. అయితే చాలా మంది ఇల్లు, ఆఫీస్, లేదా షాప్ విషయంలోనే వాస్తు నియమాలను పాటిస్తారు. కానీ కారు ఉన్నవారు కూడా తమ వెహికిల్‌లో కొన్ని వాస్తు నియమాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి కార్ ఓనర్స్ తమ వెహికిల్ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 08, 2023 | 5:30 PM

వాస్తు నిపుణుల సూచనల ప్రకారం కారులో వినాయకుడు లేదా హనుమంతుని విగ్రహం పెట్టుకోవాలి. విఘ్నేశ్వరుడు ప్రయాణ సమయంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాడని నమ్మకం. అంజనేయుడు ఉన్న చోట భూతప్రేతాలు ఉండవని కూడా నమ్మడం ఇందుకు కారణమని వాస్తు నిపుణులు వివరిస్తున్నారు.

కారులో నల్లని తాబేలు బొమ్మ ఉంటే వెహికిల్ ఓనర్ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

కార్ డాష్ బోర్డులో క్రిస్టల్స్ పెట్టుకుంటే శుభప్రదమంట. ఇవి భూ సంబంధమైనవి కాబట్టి వెహికిల్ చాలా సురక్షితంగా ఉంటుందని వారు అంటున్నారు.

ఏవి ఉన్నా లేకున్నా కారులో తప్పనిసరిగా ఓ వాటర్ బాటిల్ పెట్టుకోవాలని, జలతత్వం సౌభాగ్యాన్ని పెంపొందిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అలాగే కారులో విరిగిన లేదా పాడైపోయిన వస్తువులు అసలు ఉంచకూడదని అవి, ప్రమాదాలను, అశుభాలను ఆకర్షిస్తాయంట.




