Bomb Threat to Gannavaram Airport: ఎయిర్‌పోర్టులో బాంబ్ ఉందంటూ ఆకతాయి ప్రాంక్ కాల్.. పోలీసులు ఇచ్చిన ట్విస్ట్‌కు ఫ్యూజులు ఔట్
అల్లరి చేష్టలకు, ఆకతాయి పనులకు ఈ మధ్య హద్దు అదుపు లేకుండా పోయింది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది యువకులు. ఇక తాజాగా ఇలాంటి పనే ఓ వ్యక్తి చేసాడు. ఏకంగా గన్నవరం విమానాశ్రయానికే బాంబ్ వుందటూ ఫెక్ కాల్ చేసాడు. దాంతో ఎయిర్ పోర్ట్ మొత్తం మూడు గంటల పాటు గజగజ వణికి పోయింది. దీంతో మూడు గంటలపాటు విమానం..
గన్నవరం, సెప్టెంబర్ 5: అల్లరి చేష్టలకు, ఆకతాయి పనులకు ఈ మధ్య హద్దు అదుపు లేకుండా పోయింది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది యువకులు. ఇక తాజాగా ఇలాంటి పనే ఓ వ్యక్తి చేసాడు. ఏకంగా గన్నవరం విమానాశ్రయానికే బాంబ్ వుందటూ ఫెక్ కాల్ చేసాడు. దాంతో ఎయిర్ పోర్ట్ మొత్తం మూడు గంటల పాటు గజగజ వణికి పోయింది. దీంతో మూడు గంటలపాటు విమానం ఆలస్యంగా బయల్దేరడంతోపాటు అటు ప్రయాణికులు, ఇటు ఎయిర్ పోర్టు అధికారులు ముచ్చెమటలు పట్టాయి. రంగంలోకి దిగిన పోలీసులు అదంతా ఓ ఆకతాయి చేసినపని అని తెలిసిన తర్వాత అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాల్లోకెళ్తే..
సోమవారం రాత్రి 9:30 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్ళటానికి ఎయిర్ ఇండిగో విమానం సిద్ధంగా ఉంది. అప్పటికే ప్యాసింజెర్స్ అందరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు కొద్దీసేపట్లో విమానం గాల్లో ఎగరబోతుంది అనేలోపే ఓ ఫోన్ కాల్ అందరిని ఉరుకులు పరుగులు పెట్టించింది. 9:30 కు కాస్త ముందు ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండిగో విమానంలో బాంబ్ ఉందంటూ వచ్చిన ఫోన్ కాల్ తో అందరి గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. దాంతో అప్రమాత్రం అయినా ఎయిర్ పోర్ట్ అధికారులు విమానాన్ని నిలిపేసి ఆ ప్లేస్ మొత్తం కాళీ చేపించేసారు.
ఈ లోపే మళ్ళి ట్విస్ట్ మొదట చేసిన వ్యక్తే తిరిగి కాల్ చేసి ఫెక్ కాల్ అంటూ పెట్టేసాడు. అయినప్పటికీ పోలీసులకు అనుమానం ,ప్యాసింజెర్స్ భద్రతకు సంబంధించింది కావటంతో మొతం రాకపోకలు నిలిపేసి బాంబ్ స్క్వాడ్ తో ఒక్క ఫ్లైట్ మాత్రమే కాదు ఎయిర్పోర్ట్ మొత్తం తనిఖీలు చేసారు. ఆక్టోపస్ టీం కూడా అక్కడకు చేరుకుంది. దాదాపు మూడు గంటల పాటు ప్రయాణికులకు ఇక్కట్లు అధికారులకు చమటలు తప్పలేదు . ఎట్టకేలకు మొత్తం తనిఖీలు చేసి బాంబ్ లేదని నిర్దారించుకున్నాక అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లాల్సిన సమయం కంటే మూడు గంటలు అలస్యంగా విమానం బయలుదేరింది. ఇక ఈలోపే వచ్చిన కాల్ ఆధారంగా కాల్ చేసిన వ్యక్తి తణుకుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు పోలీసులు. రాత్రంతా పరుగులు పెట్టించిన అతగాన్ని పట్టుకోవటానికి ఒక ఎస్సై ఇద్దరు కానిస్టేబుల్స్ తణుకు వెళ్లి కాల్ చేసిన వ్యక్తితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి గన్నవరం తీసుకుని వచ్చారు. గతంలో ఇలాంటి పనులే చేస్తే మతిస్థిమితం సరిగా లేదని మందలించి వదిలేసినా పోలీసులు ఇప్పడూ గుణపాఠం చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.