BJP Vishnu Vardhan: ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే కరోనా పేషెంట్ల అడ్డగింత.. తీవ్రంగా స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి..
BJP Vishnu Vardhan: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చికిత్స కోసం వస్తున్న కోవిడ్ పేషెంట్లను అడ్డుకోవడంపై ఏపీ బీజేపీ రాష్ట్ర నేత..
BJP Vishnu Vardhan: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చికిత్స కోసం వస్తున్న కోవిడ్ పేషెంట్లను అడ్డుకోవడంపై ఏపీ బీజేపీ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. చికిత్స కోసం వస్తున్న కోవిడ్ పేషెంట్లను అడ్డగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. హైదరాబాద్ నగరం పదేళ్ల వరకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆరోగ్యం బాగోలేక చికిత్స కోసం వచ్చే వారిని ఎలా అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ మెడికల్ హబ్ అని.. చికిత్స కోసం అనేక ప్రాంతాల నుంచి బాధితులు వస్తారని అన్నారు.
కరోనా రోగులు, ఇతర బాధితులు అత్యవసర సేవల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్‌లను తెలంగాణ ప్రాంతంలో ఆడ్డుకోవడం సరికాదన్నారు. ఉమ్మడి రాజధానిలో మరో మూడేళ్ల వరకు మౌళిక సదుపాయాలు వినియోగించుకునే హక్కు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక కరోనా సంక్షోభం సమయంలో వైద్యానికి సంబంధించి అయితే ఎల్లలు కూడా అవసరం లేదని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభం నెలకొని ఉందని, మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయం ఇది అనే విషయాన్ని తెలంగాణ పోలీసులు గుర్తించాలని విష్ణువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Also read: