Telangana Corona: లాక్​డౌన్​పై తెలంగాణ స‌ర్కార్ పున‌రాలోచ‌న‌.. మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం!

వైర‌స్ వ్యాప్తి పెర‌గ‌డం, మ‌ర‌ణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌టంతో తెలంగాణ స‌ర్కార్ లాక్​డౌన్​పై పున‌రాలోచ‌న‌లో ప‌డింది. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం...

Telangana Corona: లాక్​డౌన్​పై తెలంగాణ స‌ర్కార్ పున‌రాలోచ‌న‌.. మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం!
Cm Kcr
Follow us
Ram Naramaneni

|

Updated on: May 10, 2021 | 8:33 PM

వైర‌స్ వ్యాప్తి పెర‌గ‌డం, మ‌ర‌ణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌రంగా ఉండ‌టంతో తెలంగాణ స‌ర్కార్ లాక్​డౌన్​పై పున‌రాలోచ‌న‌లో ప‌డింది. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా లాక్‌డౌన్‌పై సమావేశంలో చర్చించనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్​డౌన్​ విధించినా.. కరోనా వ్యాప్తి తగ్గడం లేదని, సరైన ఫలితాలు లేవని నివేదికలు అందుతున్నాయని స‌ర్కార్ చెబుతోంది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్ని వర్గాలు లాక్​డౌన్​ కావాలని కోరుతున్నాయని గ‌వ‌ర్న‌మెంట్ పేర్కొంది.ఈ పరిస్థితుల్లో లాక్​డౌన్​ విధిస్తే వచ్చే సాదకబాధకాలపై కేబినెట్​ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఒకవేళ లాక్​డౌన్​ విధిస్తే ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా . అన్ని అంశాలపై కూలంక‌షంగా చర్చించి లాక్‌డౌన్‌పై కేబినెట్​ కీలక నిర్ణయం తీసుకోనుంది.

మ‌రోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త‌గా 65,923 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా 4,826 మందికి వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,36,619కి చేరింది. తాజాగా 32 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ‌ బులిటెన్‌ విడుదల చేసింది. కాగా, మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 2,771కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 62,797 యాక్టివ్ కేసులు ఉన్నాయని, కొత్త‌గా 7,754 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 723 కేసులు వెలుగుచూశాయి.

Also Read: బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్లు.. కేవలం 100 రూపాయలతో మూడు నెలల పాటు..

ఎన్టీఆర్ క‌రోనా బారిన ప‌డ‌డంపై స్పందించిన చంద్ర‌బాబు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా..