మూడో కోవిడ్ వేవ్ ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , ఆక్సిజన్ బెడ్స్ ను పెంచుతున్నామని వెల్లడి
థర్డ్ కోవిడ్ వేవ్ ని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి పెద్దఎత్తున వ్యాక్సిన్లను కోరుతున్నామని ఆయన చెప్పారు.
థర్డ్ కోవిడ్ వేవ్ ని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి పెద్దఎత్తున వ్యాక్సిన్లను కోరుతున్నామని ఆయన చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. నగరంలో ఆక్సిజన్ బెడ్స్ సంఖ్యను పెంచుతున్నామని, ఏ ఆసుపత్రి కూడా తమ బెడ్స్ సంఖ్యను తగ్గించుకోవలసిన అవసరం లేదని అన్నారు. ఆక్సిజన్ కొరత సమస్య తీరిందన్నారు. తాజాగా ఢిల్లీలో 12,651 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, థర్డ్ వేవ్ లో 30 వేల కేసులు వచ్చినా దాన్ని ఎదుర్కోగలుగుతామన్న నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు. తమ వద్ద మూడు, నాలుగు రోజులకు సరిపడా వ్యాక్సిన్ మాత్రమే ఉందన్నారు, ఇప్పుడు వ్యాక్సిన్లను ఏ రాష్ట్రమైనా ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. మాకు నెలకు ఇచ్ఛే స్టాక్ గురించి కేంద్రం నుంచి లేఖ వచ్చింది.. అంటే ఇక కేంద్రమే వ్యాక్సిన్ ని కేటాయిస్తుందని భావిస్తున్నాం అని అయన అన్నారు. అంతకు ముందు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తో కలిసి కొన్ని కోవిద్ సెంటర్లను సందర్శించారు.
కాగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు 19.10 శతం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి., 13,306 మంది రోగులు కోలుకున్నారు. ఆసుపత్రిలో చేరాలంటే కరోనా వైరస్ టెస్ట్ రిపోర్టులు అవసరం లేదని కేంద్రం ఇదివరకే తన తాజా గైడ్ లైన్స్ లో పేర్కొంది. ఇలా ఉండగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కోవిద్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: మాకూ ఆక్సిజన్ కోటా పెంచాల్సిందే… కేంద్రానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ, లేని పక్షంలో నానా పాట్లు తప్పవని ఆందోళన