మాకూ ఆక్సిజన్ కోటా పెంచాల్సిందే… కేంద్రానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ, లేని పక్షంలో నానా పాట్లు తప్పవని ఆందోళన

తమ రాష్ట్రానికి కూడా ఆక్సిజన్ కోటాను పెంచాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాస్తూ తమకు సప్లయ్ అయిన బఫర్ స్టాక్ ని పొరుగు రాష్ట్రాలకు ఇచ్చామని, ఇక కేవలం 86 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే తమవద్ద ఉందని అన్నారు.

మాకూ ఆక్సిజన్ కోటా పెంచాల్సిందే... కేంద్రానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ, లేని పక్షంలో నానా పాట్లు తప్పవని ఆందోళన
Pinarayi Vijayan
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 10, 2021 | 9:08 PM

తమ రాష్ట్రానికి కూడా ఆక్సిజన్ కోటాను పెంచాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాస్తూ తమకు సప్లయ్ అయిన బఫర్ స్టాక్ ని పొరుగు రాష్ట్రాలకు ఇచ్చామని, ఇక కేవలం 86 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే తమవద్ద ఉందని అన్నారు. ఈ నెల 10 వరకు 40 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువును తమిళనాడుకు సరఫరా చేశామని, కానీ పరిస్థితిని బట్టి చూస్తే ఇక ఆక్సిజన్ ను ఇతర రాష్ట్రాలకు అందజేయలేమన్నారు. మా రాష్ట్రంలో 4,02,640 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఈ నెల 15 నాటికి ఇది 6 లక్షలకు పెరగవచ్ఛునని ఆయన పేర్కొన్నారు. ఏమైనా ఈ తేదీ నాటికీ మాకు 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇంకా తమకు మరిన్ని క్రయోజెనిక్ ట్యాంకర్లు అవసరమని విజయన్ తెలిపారు. మొదట కేరళ నేషనల్ గ్రిడ్ పై ఒత్తిడి తేకుండా 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని పొందగలిగింది. కానీ పొరుగు రాష్ట్రాల డిమాండు దృష్ట్యా ఆ రాష్ట్రాలకు ఈ ప్రాణ వాయువును పంపడంతో ఇప్పుడు చిక్కుల్లో పడింది.

అటు అదనపు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తో కూడిన ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చేరుతున్నాయి.ఆక్సిజన్ కొరత సై ఇన్నాళ్లూ ఢిల్లీ నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న కేంద్రం ఇప్పుడు కేరళ నుంచి కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కేరళలో కూడా కోవిద్ కేసుల సంఖ్య పెరుగుతుండడాన్ని విజయన్ పదేపదే తన లేఖలో ప్రస్తావించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Vaccine: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ వివాదం..స్పందించిన ప్రభుత్వం..రాష్ట్రానికి వచ్చిన టీకాల లెక్కలు ఇవే!

AP Police Pass: కరోనా ఆంక్షలు.. అత్యవసర పనుల కోసం పోలీస్ ‘పాస్‌’లు కావాలంటే.. ఇలా చేయండి..