AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Govt: గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. అధికారులకు మంత్రి ఆదేశం..

Telangana Govt: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పెండింగ్ లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 217 కోట్లు విడుదల చేసిందని..

Telangana Govt: గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. అధికారులకు మంత్రి ఆదేశం..
Shiva Prajapati
|

Updated on: May 10, 2021 | 8:17 PM

Share

Telangana Govt: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పెండింగ్ లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 217 కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను అన్ని గ్రామ పంచాయితీలకు విడుదల చేయడం జరిగిందని, ఈ నిధులతో పెడింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడానికి గ్రామపంచాయితీలకు ఆదేశాలు జారీ చేయాలని అధికారులను కోరారు. హైదరబాద్‌లోని బంజారా‌హిల్స్ లో ఉన్న మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు జరిగిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ ఉన్నత అధికారుల సమీక్షా సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ అభివృద్ది పథకాలను మంత్రి సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దయాకర్ రావు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎం‌జి‌ఎన్‌ఆర్‌ఈ‌జి‌ఎస్ పనులు ఉదృతంగా జరుగుతున్నాయని, అందువల్ల పని ప్రదేశాల్లో కూలీలకు కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కూలీలు తప్పక చేతులను శానిటైజన్ చేసుకోవడంతో పాటుగా విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించి పనులు చేసే విధంగా సంబంధిత అదికారులు, ఉద్యోగులు చూడాలని ఆయన కోరారు. అదే విదంగా ప్రస్తుత ఎండ కాలంలో కూలీలు వడ దెబ్బ పడకుండ సంబందిత అదికారులు, ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.1554 కోట్ల వ్యయంతో 12,270 వైకుంఠ దామాల నిర్మాణాన్ని చేపట్టడం జరుగగా, ఇందులో 11,250 పూర్తి అయ్యాయని, 1470 వివిధ దశలల్లో ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్యా పూర్తయిన వైకుంఠ దామలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న అన్ని పనులను వెంటనే పూర్తి చేయలని ఆయన ఆదేశించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన పీఎంజీఎస్ఐ పనులను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఆరోగ్య సర్వేలో ఆశ వర్కర్లతో సర్పంచులు, పంచాయితీ సెక్రెటరీలు సమన్యయంతో పనిచేసి ఈ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా జరిగే విధంగా చూడాలని ఆయన కోరారు. కరోనా నివారణ చర్యలల్లో భాగంగా సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు గ్రామాలు పారిశుద్ధ్యముగా ఉండే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. గ్రామాల్లో కోవిడ్ సోకిన రోగులకు వారి ఇంట్లో హోమ్ ఐషోలేషన్ ఉండటానికి సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ విద్యార్థుల వసతి గృహాల్లో ఐషోలేషన్ సెంటర్లు సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దాతల సహకారంతో ఐసోలేషన్ కేంద్రాల్లో రోగులకు ఆహారం, పoడ్లు, పాలు, ఇతర నిత్యవసర వస్తువులు అందించాలని ఆయన కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమము కింద నాటిన మొక్కలను నీటిని పోసి మొక్కలు ఎండి పోకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. గ్రామాల సర్పంచులను, పంచాయితీ కార్యదర్శులను కోరారు. నాటిన మొక్కలలో 100 శాతం సంరక్షించడనికి సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు భాద్యత తీసుకోవాలన్నారు. కాగా, ఈ సమీక్షా సమావేశంలో రాష్ర్ట పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ సెక్రెటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ శ్రీ రఘున౦ధన్ రావు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈ‌ఎన్‌సి శ్రీ సంజీవ రావు పాల్గొన్నారు.

Also read:

Lock Down: లాక్‌డౌన్‌నే ఛాన్స్‌గా తీసుకున్న దొంగ.. ఏకంగా బస్సునే దొంగిలించాడు.. చివరికి ఏం జరిగిందంటే…

బల పరీక్షలో ఓడిపోయిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి, ఇక ప్రచండదే హవా ? మరింత ముదిరిన రాజకీయ సంక్షోభం,