బల పరీక్షలో ఓడిపోయిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి, ఇక ప్రచండదే హవా ? మరింత ముదిరిన రాజకీయ సంక్షోభం,

నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి సోమవారం ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) లో జరిగిన బల పరీక్షలో ఓటమి పాలయ్యారు. పుష్ప కమల్ దహాల్ ప్రచండ నేతృత్వంలోని

బల పరీక్షలో ఓడిపోయిన నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి,  ఇక ప్రచండదే హవా ? మరింత ముదిరిన రాజకీయ సంక్షోభం,
K P Sharma Oli
Umakanth Rao

| Edited By: Phani CH

May 10, 2021 | 8:09 PM

నేపాల్ ప్రధాని కె.పి.శర్మ ఓలి సోమవారం ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) లో జరిగిన బల పరీక్షలో ఓటమి పాలయ్యారు. పుష్ప కమల్ దహాల్ ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్టు సెంటర్) ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడంతో ఓలి బల పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారీ ఆదేశాలపై దిగువ సభ (పార్లమెంట్) ప్రత్యేకంగా సమావేశం కాగా ఈ సభలో ఓలి 93 ఓట్లను సాధించారు.అయితే 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆయనకు 136 ఓట్లు లభించాల్సి ఉంది. అప్పుడే ఆయన నెగ్గగలుగుతారు. కానీ మొత్తం 124 మంది సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. నలుగురు సభ్యులు సస్పెన్షన్ లో ఉన్నారు.ప్రచండ నేతృత్వంలోని పార్టీ ఓలి ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడంతో ఓలి సర్కార్ మైనారిటీలో పడిపోయింది. అసలు గత ఏడాది డిసెంబరులోనే నేపాల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రెసిడెంట్ భండారీ పార్లమెంటును రద్దు చేసి ఏప్రిల్ 30 న తాజా ఎన్నికలను ప్రకటించారు. కాగా ఓలి ఓటమిపై వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Cyber Crime: మందు బాబును బుక్ చేయబోయి అడ్డంగా బుక్కైన సైబర్ నేరగాళ్లు.. నిమిషాల గ్యాప్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ‘అడ్డుపడుతున్న కోవిడ్’, మూడు సార్లు వాయిదా , సోనియా దీర్ఘ కాల అధినేత్రి అవుతారా ?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu