కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ‘అడ్డుపడుతున్న కోవిడ్’, మూడు సార్లు వాయిదా , సోనియా దీర్ఘ కాల అధినేత్రి అవుతారా ?
పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మళ్ళీ వాయిదా వేసింది. ఈ పోస్టుకు ఎన్నిక ఎప్పడు, ఏ తేదీన నిర్వహించాలన్న విషయమై సీడబ్ల్యూసీ సోమవారం చర్చించాల్సి ఉంది.
పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మళ్ళీ వాయిదా వేసింది. ఈ పోస్టుకు ఎన్నిక ఎప్పడు, ఏ తేదీన నిర్వహించాలన్న విషయమై సీడబ్ల్యూసీ సోమవారం చర్చించాల్సి ఉంది. జూన్ 23 న నిర్వహించాలని గతంలో చాలాసార్లు భావించారు. నేటి సమావేశంలో ఆ తేదీని ఖరారు చేయాలనుకున్నా..మెజారిటీ సభ్యులు వ్యతిరేకించారు. దేశంలో కోవిడ్ పరిస్థితి కారణంగా ఎన్నికను వాయిదా వేయాలని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఎన్నిక నిర్వహణకు ఇది సమయం కాదని, వారు వ్యాఖ్యానించినట్టు వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ తెలిపారు. ఈ తరుణంలో పార్టీ కార్యకర్తలంతా కోవిద్ బాధితులకు అండగా ఉండాలని, వారిని ఆదుకోవాలని మెజారిటీ సభ్యులు కోరినట్టు ఆయన చెప్పారు. దీంతో తాత్కాలికంగా ఎన్నికను మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చిందన్నారు.. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. అయితే తాత్కాలికంగా సోనియా గాంధీని పార్టీ అధినేత్రిగా ఎన్నుకున్నారు. లేదా ఎంపిక చేశారు. ఇప్పటికి మూడు సార్లు ఈ పోస్టుకు ఎన్నిక వాయిదా పడింది.
మరోవైపు వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ ఓటమి కేడర్ లో నిరాశను నింపుతోంది.గత కొన్ని నెలలుగా కొంతమంది సీనియర్ల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటోంది. పార్టీ నాయకత్వం మారాలని, పార్టీలో సంస్కరణలు అవసరమని ముఖ్యంగా జీ-23 లెటర్ నేతలు ఆ మధ్య తీవ్ర అసమ్మతి గళాన్ని వినిపించారు. కానీ సోనియా కనిపించగానే అంతా కామ్ అయిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని విచిత్రం ఇదే.. చూడబోతే సోనియా దీర్ఘకాలం పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: BSNL Offers: బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్లు.. కేవలం 100 రూపాయలతో మూడు నెలల పాటు..
ఒంటెల యాంటీ బాడీలతో కోవిడ్‌కు చెక్..? యూఏఈ లో ముమ్మరంగా కొనసాగుతున్న పరిశోధనలు ( వీడియో )