Oxygen Tankers: ఆపద కాలంలో స్నేహవారధిగా నిలిచిన సింగపూర్.. భారత్‌కు భారీ సాయం..

Oxygen Tankers: ఆపద కాలంలో స్నేహవారధిగా నిలిచింది సింగపూర్‌. మిత్రదేశంగా భారత్‌కు ఎనిమిది క్రయోజినిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు,..

Oxygen Tankers: ఆపద కాలంలో స్నేహవారధిగా నిలిచిన సింగపూర్.. భారత్‌కు భారీ సాయం..
Follow us

|

Updated on: May 10, 2021 | 8:21 PM

Oxygen Tankers: ఆపద కాలంలో స్నేహవారధిగా నిలిచింది సింగపూర్‌. మిత్రదేశంగా భారత్‌కు ఎనిమిది క్రయోజినిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు, 3,898 ఆక్సిజన్‌ సిలండర్లు సహా వైద్య పరికరాలను సమకూర్చింది. ఈ నెల 5వ తేదీన సింగపూర్‌ నుంచి బయలుదేరిన ఐఎన్ఎస్ ఐరావత్‌ నౌక ఇవాళ విశాఖకు చేరింది. ఆపరేషన్‌ సముద్ర సేతు-2లో భాగంగా కోవిడ్‌ రిలీఫ్ మిషన్‌లో తొమ్మిది నౌకలు సేవలందిస్తున్నాయి. ఈ నౌకలు.. గల్ఫ్‌, ఆగ్నేయాసియాలోని పలు మిత్రదేశాల నుంచి మెడికల్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ను, కరోనా కట్టడిలో భాగంగా ఆధునాతన వైద్య పరికరాలను భారత్‌కు చేరవేస్తున్నాయి. ఐఎన్ఎస్ ఐరావత్‌.. సింగపూర్‌ నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్లను, సిలండర్లను సోమవారం విశాఖకు చేర్చింది. కరోనా కష్టకాలంలో ఇండియన్‌ నేవీ సమర్థవంతమైన సేవలందిస్తోంది.

ఇక నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కింద చర్యలకు ఉపక్రమించింది. డాక్టర్‌ భన్సోడి, ఇంజినీర్లు శివకుమార్‌, సత్యనారాయణలతో కూడా నేవీ బృందం తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆస్పత్రులను సందర్శించారు. కోవిడ్‌ సెంటర్లలో ఆక్సిజన్‌ ట్యాంకులను, పైప్‌లైన్లను పరిశీలించారు. ఆక్సిజన్‌ అవసరం ఏమేరకు వుంది, ఆక్సిజన్‌ నిల్వలు వృధా కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో క్షుణ్ణంగా పరిశీలించారు అధికారులు. ఆక్సిజన్‌ నిర్వహణలో లోపాలను సరిదిద్దేందుకు నేవీ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

Also read:

Telangana Govt: గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయండి.. అధికారులకు మంత్రి ఆదేశం..

Japan Olympics: జపాన్ ఒలింపిక్స్ జరిగేది అనుమానమే..క్రీడలకు వ్యతిరేకంగా మెజార్టీ ప్రజలు..ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో?

Lock Down: లాక్‌డౌన్‌నే ఛాన్స్‌గా తీసుకున్న దొంగ.. ఏకంగా బస్సునే దొంగిలించాడు.. చివరికి ఏం జరిగిందంటే…

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!