AP E-Pass: కరోనా ఆంక్షలు.. అత్యవసర పనుల కోసం పోలీస్ ‘పాస్‌’లు కావాలంటే.. ఇలా చేయండి..

AP Police Pass: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. రాష్ట్ర..

AP E-Pass: కరోనా ఆంక్షలు.. అత్యవసర పనుల కోసం పోలీస్ ‘పాస్‌’లు కావాలంటే.. ఇలా చేయండి..
Follow us
Shiva Prajapati

| Edited By: Team Veegam

Updated on: May 10, 2021 | 9:36 PM

AP Police Pass: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండటంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. మధ్యాహ్నం 12 గంటల వకు మాత్రమే దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చింది. గుంపులు గుంపులుగా ఎవరూ బయట తిరుగొద్దని, నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా బయట తిరిగినే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు, అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే అత్యవసర పనుల నిమిత్తం బయటకు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం పోలీసులు ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేస్తున్నారు. అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచిన వారు తమ యొక్క వినతి పత్రాలను సంబంధిత పోలీస్ అధికారులకు పంపించి అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ పాస్‌ల జారీకి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు.. జిల్లాల వారీగా యూనిట్ అధికారుల వాట్సప్ నెంబర్, మెయిల్ ఐడీలను ప్రకటించింది. జిల్లాల వారీగా పోలీసుల అధికారుల వాట్సప్/మెయిల్ ఐడీ వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనిట్ల అధికారుల మొబైల వాట్సప్ నెంబర్లు, మెయిల్ ఐడీలు.. 1. శ్రీకాకుళం 6309990933 dail100srikakulam@gmail.com

2. విజయనగరం 9989207326 spofvzm@gmail.com

3. విశాఖఫట్నం రూరల్ 9440904229 vizagsp@gmail.com

4. విశాఖపట్నం సిటీ 9493336633 cpvspc@gmail.com

5. తూర్పు గోదావరి(కాకినాడ) 9494933233 sp@eg.appolice.gov.in

6. రాజమండ్రి అర్బన్ 9490760794 sp@rjyu.appolice.gov.in

7. పశ్చిమ గోదావరి 8332959175 policecontrolroomeluruwg@gmail.com

8. కృష్ణా (మచిలీపట్నం) 9182990135 sp@kri.appolice.gov.in

9. విజయవాడ సిటీ 7328909090 cp@vza.appolice.gov.in

10. గుంటూరు రూరల్ 9440796184 Dail100gunturrural@gmail.com

11. గుంటూరు అర్బన్ 8688831568 guntururbansp@gmail.com

12. ప్రకాశం 9121102109 spongole@gmail.com

13. నెల్లూరు 9440796383 nelloresp@gmail.com

14. చిత్తూరు 9440900005 spchittoor@gmail.com

15. తిరుపతి అర్బన్ 9491074537 sptpturban@gmail.com

16. అనంతపురం 9989819191 spatp1@gmail.com

17. కడప 9121100531 spkadapa2014@gmail.com

18. కర్నూలు 7777877722 spkurnool.kur@gmail.com

అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోవాలనుకునే వారు తమ యొక్క విజ్ఞాపనలను పైన పేర్కొన్న వాట్సప్‌ మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడీలకు పంపాలని పోలీసు అధికారులు తెలిపారు. వీటిని అధికారులు ధ్రువీకరించి.. సదరు వ్యక్తుల ఫోన్/మెయిల్‌లకు పాస్‌ను జారీ చేయడం జరుగుతుందన్నారు. అయితే, సదరు వ్యక్తులు ప్రయాణించేటప్పుడు జిల్లాల యూనిట్ వాట్సప్ నెంబర్, మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడుతుందని, ఫార్వర్డ్ చేయబడినవి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అలాగే సదరు వ్యక్తులు ఇతర ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

పోలీస్ పాస్ కోసం ఏం అవసరం అంటే.. పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.

Also read: TS Junior Doctors Strike: ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ విధించిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌కుంటే..

BJP Vishnu Vardhan: ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే కరోనా పేషెంట్ల అడ్డగింత.. తీవ్రంగా స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి..