Telangana Govt: చిన్న చిన్న తప్పిదాలకు రైతులను ఇబ్బంది పెట్టకండి.. అధికారులకు స్పష్టం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..

Telangana Govt: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై..

Telangana Govt: చిన్న చిన్న తప్పిదాలకు రైతులను ఇబ్బంది పెట్టకండి.. అధికారులకు స్పష్టం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి..
Niranjan Reddy
Shiva Prajapati

|

May 10, 2021 | 8:37 PM

Telangana Govt: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. సమీక్షలో భాగంగా అధికారులకు మంత్రి నిరంజన్‌రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీలైనన్ని ఎక్కువ వాహనాలను రవాణాకు వాడుకోవాలని సూచించారు. మిల్లులకు ధాన్యం వచ్చిన వెంటనే అన్ లోడ్ చేయాలని, ఆయా మిల్లుల్లో స్థల సమస్య ఉంటే పక్కన ఉండే మిల్లులకు, గోదాంలకు పంపించాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఎంతో చేయూతనిచ్చి పంటలు పండించేందుకు ప్రోత్సహిస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. చిన్న చిన్న తప్పిదాలతో రైతులకు నష్టం కలిగించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవొద్దని అధికారులను కోరారు. క్రాప్ బుకింగ్‌లో పేరు నమోదు కాలేదన్న సాకుతో రైతుల ధాన్యం కొనుగోలును తిరస్కరించొద్దని మంత్రి స్పష్టం చేశారు. క్రాప్ బుకింగ్ సమస్యలుంటే తరువాత శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

జిల్లాల నుంచి కరోనా కేసులు హైదరాబాద్ వరకు వెళ్లకుండా జిల్లా స్థాయిలోనే మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. గత నాలుగు రోజుల నుండి కరోనా కేసులు తగ్గుతున్నాయని వెల్లడించిన కలెక్టర్లు.. మరొక రెండు మాసాలు అందరం కలిసికట్టుగా కృషి చేస్తే కరోనా నుంచి బయటపడతామని చెప్పారు. కరోనా కట్టడిలో ఆశావర్కర్ల సేవలు వెలకట్టలేనివని మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, వీఎం అబ్రహం, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్లు శృతి ఓఝా పాల్గొన్నారు.

Also read:

Telangana Corona: లాక్​డౌన్​పై తెలంగాణ స‌ర్కార్ పున‌రాలోచ‌న‌.. మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం!

Oxygen Tankers: ఆపద కాలంలో స్నేహవారధిగా నిలిచిన సింగపూర్.. భారత్‌కు భారీ సాయం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu