AP-TS Weather Report: ఉపరితలద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
AP-TS Weather Report: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ..
AP-TS Weather Report: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపారు. అలాగే తెలంగాణలోనూ పశ్చిమ, వాయువ్య దిశల నుండి క్రింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉపరితల ద్రోణి బలహీనపడిందన్నారు. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రేపు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల, భారీ వర్షం మరికొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో పాటు.. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఇక తెలంగాణలోనూ ఇదేరకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి క్రింది స్థాయి గాలులు వీస్తున్నాయన్నారు. తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ద్రోణి బలహీనపడిందన్నారు. కాగా, ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో.. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు తెలంగాణలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందన్నారు.
Also read:
Pracheen Chauhan: బాలికను లైంగికంగా వేధించాడంటూ నటుడిపై కేసు నమోదు.. అరెస్ట్ చేసిన ముంబయి పోలీసులు.
SVR Rare Photo: యముని వేషంలో ఎస్వీఆర్ ను చూసి ప్రశంసించిన అప్పటి చైనా ప్రధాని.. ఫోటో వైరల్