Andhra Pradesh: ప్రాణాలు తీస్తున్న పాములు.. భయాందోళనలో కోనసీమ వాసులు..

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలంలో పాముల బెదడతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో పాముకాటుకు ఇద్దరు బలవ్వడంతో ఈ ప్రాంత వాసులకు కంటిమీద కునుకే కరువవుతున్న పరిస్థితి..

Andhra Pradesh: ప్రాణాలు తీస్తున్న పాములు.. భయాందోళనలో కోనసీమ వాసులు..
Snake In House
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 12, 2022 | 10:55 AM

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం మండలంలో పాముల బెదడతో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో పాముకాటుకు ఇద్దరు బలవ్వడంతో ఈ ప్రాంత వాసులకు కంటిమీద కునుకే కరువవుతున్న పరిస్థితి నెలకొంది. ఏ టైంలో ఎటునుంచి పాము వస్తుందనే ఆందోళనలో బతుకుతున్నారు ఇక్కడి వాసులు. అసలే వర్షా కాలం.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో చెట్ల పొదలు, తుప్పల్లో పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. దీంతో ఎప్పుడు పాము కాటు బారిన పడతామో అనే ఆందోళన నెలకొంది. మొత్తానికి అంబెద్కర్ కోనసీమ జిల్లాలో పాములు ప్రజలను బెంబేలెతిస్తున్నాయి. రాత్రి సమయాల్లో అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ఈ విష సర్పాలు. ఇళ్లలోకి చేరి కాట్లు వేస్తుండటంతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన మూడు సంవత్సరాల బాలుడు పాముకాటుకి గురయ్యి మృతి చెందాడు. అలాగే తమ ఇళ్లలోకి కూడా పాములు వస్తున్నాయని గ్రామానికి చెందిన పలువురు చెబుతున్నారు.

బాలుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి పై కప్పు నుండి బాలుడిపై పాము పడి కాటు వేసింది. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి కుటుంబం కన్నీరు మున్నీరై విలపిస్తోంది. మరోవైపు 15రోజుల క్రితం మామిడికుదురు లో పాము కాటుకు బలై కొబ్బరి వలపు కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

కోనసీమ జిల్లాలో గత వారం రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పాములు ఇళ్లలోకి చేరుతున్నాయి. ఇంట్లోని వారంతా నిద్రిస్తున్న సమయంలో ఇళ్లలోకి వచ్చి కాట్లు వేస్తుండటంతో ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని, పాములను కట్టడి చేయాలని కోనసీమ వాసులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

కోనసీమ జిల్లాలో ఇళ్లలోకి వచ్చిన పాములు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో