ఉచిత చికెన్ఫుడ్ మేళా.. చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్ ఫ్రీ..! బారులు తీరిన జనం..ఎక్కడంటే..
500 కేజీల చికెన్ ఫ్రై, 5000 ఉడికించిన కోడిగుడ్లను ఉచిత పంపిణీ చేశాయి. ఉచిత చికెన్ కోసం జనంతో కళ్యాణమండపం కిక్కిరిసిపోగా ఎగబడ్డ చికెన్ ప్రేమికులతో అవగాహన సదస్సు జరిగింది. అగ్రగామి పౌల్ట్రీ సంస్థల ప్రతినిధులు ఉచిత మేళాలో భాగస్వామ్యం అయ్యాయి. ఎస్ ఎన్, వి హెచ్ ఎల్, వెంకాబ్ , స్నేహ సంస్థలు ఈ ప్రయత్నం చేయగా

చిత్తూరు జిల్లా పలమనేరులో బర్డ్ ఫ్లూ భయం పోగొట్టేలా చికెన్ ఫ్రై, ఎగ్స్ ఉచిత పంపిణీ జరిగింది. పౌల్ట్రీ ఇండస్ట్రీ యజమానుల చేత ఈ వినూత్న ప్రయత్నం జరిగింది. బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావంతో చికెన్ అమ్మకాలు నిల్, భయం ఫుల్ గా ఉండటంతో నష్టాల్లో కూరుకుపోతున్న వ్యాపారాన్ని నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. పలమనేరులోని ఎంబిఎస్ కళ్యాణ మండపంలో ఉచిత చికెన్ ఎగ్ మేళా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ సంస్థలు మన ప్రాంతంలో బర్డ్ ఫ్లూ లేదంటూ ప్రచారం చేసే ప్రయత్నం చేశాయి.
500 కేజీల చికెన్ ఫ్రై, 5000 ఉడికించిన కోడిగుడ్లను ఉచిత పంపిణీ చేశాయి. ఉచిత చికెన్ కోసం జనంతో కళ్యాణమండపం కిక్కిరిసిపోగా ఎగబడ్డ చికెన్ ప్రేమికులతో అవగాహన సదస్సు జరిగింది. అగ్రగామి పౌల్ట్రీ సంస్థల ప్రతినిధులు ఉచిత మేళాలో భాగస్వామ్యం అయ్యాయి. ఎస్ ఎన్, వి హెచ్ ఎల్, వెంకాబ్ , స్నేహ సంస్థలు ఈ ప్రయత్నం చేయగా రాయలసీమలో బర్డ్ ఫ్లూ వైరస్ ఎక్కడ గుర్తించబడలేదనీ ప్రజలు భయపడవద్దన్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ రీజినల్ చైర్మన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




