Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం.. భక్తులను ఆకట్టుకుంటున్న విభిన్న శివలింగాలు..

యోగాలో చెప్పబడిన నౌలీ అనే ప్రక్రియ ద్వారా గతంలో వినాయకుడు, నవదుర్గ ఆకృతులు, జాతీయ జెండా, యోగ డే లోగో, సేవ్ ట్రీస్ ఇలా సుమారు 50 కి పైగా కళాఖండాలను తన పొట్ట కండరాలపై చూపించి అబ్బుర పరిచా పరిచారు. తన పొట్ట కండరాల పై చూపించిన వివిధ ఆకృతులకు గాను గతంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబుల్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించారు సచ్చిదానంద యోగి.

శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధం.. భక్తులను ఆకట్టుకుంటున్న విభిన్న శివలింగాలు..
Shiva Parvati Sand Art
Follow us
Pvv Satyanarayana

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 25, 2025 | 9:52 PM

తూర్పుగోదావరి జిల్లాలో మహా శివరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని శివాలయాలన్నీ శివరాత్రి కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారు. శివరాత్రి ఉపవాసాలు, జగారం రాత్రి కార్యక్రమాల కోసం జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఒక్కో ఆలయంలో ఒక్కోరీతిలో శివ లింగాలను ఏర్పాటు చేశారు. ఆ అద్భుత శివలింగాలను చూసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

3 యూనిట్ల ఇసుకతో సైకత శిల్పం …

హర హర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక అతి ముఖ్యమైన పండగ శివరాత్రి శివ,పార్వతుల వివాహం రోజు కాబట్టి మహాశివుడు తాండవిస్తాడని భక్తుల విశ్వాసం. దానికి అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో శివపార్వతుల సైకత శిల్పాన్ని రూపొందించాడు దేవినేని శ్రీనివాస్ అనే భక్తుడు..

ఇవి కూడా చదవండి

మహాశివరాత్రి ని పురస్కరించుకుని ఇసుకతో సైకత శిల్పం రూపకల్పనకు మూడు యూనిట్ల ఇసకతో 5 అడుగుల ఎత్తు 12 అడుగుల వెడల్పుతో హర హర మహాదేవ శంభో శంకర SAVE CULTURE (సేవ్ కల్చర్)అన్న నినాదంతో ఆదిదంపతుల సైకత శిల్పాన్ని తయారు చేశారు…మహాశివరాత్రి పర్వదినాన భక్తులు శివుని రూపంలో ప్రతిమను దర్శించుకోవచ్చు అని శిల్పి దేవినేని శ్రీనివాస్ తెలిపారు….

పొట్టలో పరమేశ్వరుడు..

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగపీఠనికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి, యోగాలో చెప్పబడిన నౌలి క్రియ అనే భంగిమ ద్వారా తన పొట్ట కండరాలను శివలింగం ఆకృతిలో ఏర్పర్చి తన భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ ప్రక్రియ చూపరులను ఎంతో ఆకట్టున్నది. యోగాలో చెప్పబడిన నౌలీ అనే ప్రక్రియ ద్వారా గతంలో వినాయకుడు, నవదుర్గ ఆకృతులు, జాతీయ జెండా, యోగ డే లోగో, సేవ్ ట్రీస్ ఇలా సుమారు 50 కి పైగా కళాఖండాలను తన పొట్ట కండరాలపై చూపించి అబ్బుర పరిచా పరిచారు. తన పొట్ట కండరాల పై చూపించిన వివిధ ఆకృతులకు గాను గతంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబుల్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించారు సచ్చిదానంద యోగి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..