COVID-19 lockdown: ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఏమన్నారో తెలుసా..?

AP CM YS Jagan: దేశవ్యాప్తంగా కరోనాకేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం వేలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ భయభ్రాంతులకు

COVID-19 lockdown: ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఏమన్నారో తెలుసా..?
CM-Jagan
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 17, 2021 | 1:23 PM

AP CM YS Jagan: దేశవ్యాప్తంగా కరోనాకేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం వేలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ విధిస్తారన్న ఊహగానాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌పై ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ఒక్కటే అస్త్రమని, దీనిపై అధికార యంత్రాంగం మొత్తం దృష్టి సారించాలని జగన్‌ ఆదేశించారు. లాక్‌డౌన్‌ లేకుండా కోవిడ్‌ను నియంత్రించాల్సి ఉందంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో ఎలాంటి లాక్‌డౌన్‌ ఉండదంటూ సీఎం జగన్‌ స్పష్టంచేశారు. ఆర్థిక వ్యవహారాలు దెబ్బతినకుండా ఉండేందుకు లాక్‌డౌన్‌ విధించడం లేదని.. గతేడాది లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిందని పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు.. ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని, మళ్లీ ఆ పరిస్థితి రాకూడదంటూ కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్‌తోపాటు వ్యాక్సినేషన్, ఆసుపత్రుల సన్నద్ధత, బెడ్ల పెంపు, చికిత్స తదితర అంశాలపై ఆయన కలెక్టర్లకు, ఎస్పీలకు పలు సూచనలు చేశారు.

ఈ మహమ్మారికి వ్యాక్సినేషన్‌ అనేదే శాశ్వత పరిష్కారమని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్కువ డోసులను కేంద్రం సరఫరా చేయాల్సి ఉందన్నారు. నెలకు ఏడుకోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతుండగా, రోజుకు 23 లక్షల డోసులు తయారవుతున్నాయన్నారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరాపై పూర్తి నియంత్రణ కేంద్రానిదేనని.. ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. వీలైనంత వరకు అందరికి వ్యాక్సిన్‌ ఇవ్వడంతోపాటు మరోవైపు కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టాడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలాఉంటే.. గత వారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ .21 వేల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని సీఎం జగన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకూడదంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నికల లైవ్ అప్‌డేట్స్….

Also Read:

Assembly polls: అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు ధారపోశారు.. నగదు, డ్రగ్స్, బంగారం ఎంత పట్టుబడిందో తెలిస్తే షాకవుతారు..

Covid-19 Vaccine: ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయండి.. అమెరికాను కోరిన ‘సీరం’ సీఈఓ అదర్‌ పూనావాలా

షాకింగ్ న్యూస్.. గాలి ద్వారానే కరోనా వ్యాప్తి.. అధ్యాయనాల్లో బయటపడ్డ సంచలన విషయాలు..