Covid-19 Vaccine: ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయండి.. అమెరికాను కోరిన ‘సీరం’ సీఈఓ అదర్ పూనావాలా
Adar Poonawalla on Vaccine raw materials: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వేలాది మంది ఈ మహమ్మారి కారణంగా...
Adar Poonawalla on Vaccine raw materials: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వేలాది మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా.. వాటి తయారీకి కావాల్సిన ముడి పదార్థాల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు కంపెనీలు వ్యాక్సిన్ల తయారీకి కష్టపడుతున్నప్పటికీ.. ఫార్మా ముడి పదార్థాలు లేక ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో భారత ఫార్మా దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా ఫార్మా ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలని అమెరికాను కోరారు. కరోనావైరస్ ను అరికట్టే కోవిషీల్డ్ టీకా ఉత్పత్తిని భారత్‌లో వేగవంతం చేయాలంటే ముడిపదార్థాల ఎగుమతులపై విధించిన ఆంక్షల్ని వెంటనే ఎత్తివేయాలని ఆయన శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కోరారు. ఈ మేరకు పూనావాలా ట్విట్ చేశారు.
కరోనా మహమ్మారిని ఓడించటానికి ప్రపంచం మొత్త ఏకమవ్వాలని పూనావాలా కోరారు. ఈ వైరస్ ను ఓడించాలంటే.. ముడి పదార్థాల ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయాలని నేను వినయంగా కోరుతున్నాను. దీంతో టీకా ఉత్పత్తి పెరుగుతుంది. అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా.. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థగా వ్యవహరిస్తోంది. కరోనావైరస్ నుంచి రక్షించేందుకు తయారైన వ్యాక్సిన్లను ప్రపంచంలోనే ఎక్కువ మోతాదులో ఉత్పత్తి చేస్తూ కీలక పాత్ర పోషిస్తుంది.
పూనావాలా చేసిన ట్విట్..
Respected @POTUS, if we are to truly unite in beating this virus, on behalf of the vaccine industry outside the U.S., I humbly request you to lift the embargo of raw material exports out of the U.S. so that vaccine production can ramp up. Your administration has the details. ??
— Adar Poonawalla (@adarpoonawalla) April 16, 2021
ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. దేశీయ అవసరాలతో పాటు ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్లను ఎక్కువ మొత్తంలో సీరం ఎగుమతి చేస్తోంది. కాగా.. కరోనా ఉధృతి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం రక్షణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో టీకాల తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కోవిషీల్డ్ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాలు అమెరికా నుంచి అందడం లేదు.
Also Read: