Ayodhya Ram Temple: రాములోరి ఆలయానికి చెల్లని విరాళాలు.. వీటి విలువ అక్షరాల రూ. 22 కోట్లు..
Ayodhya Ram Temple: హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామ మందిర నిర్మాణానికి పునాది పడిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం పాటు కోర్టుల్లో నానుతూ వచ్చిన రామ మందిర నిర్మాణ పనులు.....
Ayodhya Ram Temple: హిందువుల చిరకాల స్వప్నమైన అయోధ్య రామ మందిర నిర్మాణానికి పునాది పడిన విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలం పాటు కోర్టుల్లో నానుతూ వచ్చిన రామ మందిర నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ గొప్ప కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు విరాళాలు అందించే అవకాశాన్ని కల్పించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విరాళాలు అందించారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వహించిన ఆడిట్‌లో ఆసక్తికర విషయం వెల్లడైంది.
రామ మందిర నిర్మాణం కోసం ఇచ్చిన విరాళాల చెక్కుల్లో రూ.22 కోట్ల విలువైన 15 వేలకు పైగా చెక్కులు బౌన్స్ అయినట్లు తేలింది. కొన్ని చెక్కులు చెల్లకపోగా.. మరికొన్నింటిపై సంతకం సరిగాలేకపోవడం, కొన్నింటి బ్యాంకు ఖాతాల్లో చెక్‌లో పేర్కొన్న మేరకు నిధులు లేకపోవడం, కొన్ని చెక్కులపై కొట్టివేతలు వంటి కారణాలతో చెల్లుబాటు కాలేవు. దీంతో చెక్కుల పొరపాట్లను సవరించేందుకు సంబంధిత బ్యాంకులను సంప్రదిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. అంతేకాకుండా. చెల్లని చెక్కుల గురించి ఆయా వ్యక్తులను సంప్రదించి కొత్త చెక్కులు ఇవ్వాలని కోరుతామని తెలిపారు. ఇదిలా ఉంటే బౌన్స్ అయిన 15వేల చెక్కుల్లో సుమారు రెండు వేల చెక్కులు అయోధ్య పరిధిలోవి కాగా.. మిగతా 13 వేల చెక్కులు ఇతర ప్రాంతాలకు చెందినవిగా తేలింది.
Also Read: Janasena: గ్రేటర్ హైదరాబాద్ లో జనసేనకు గట్టి షాక్.. ఆ పొరపాటు కారణంగానే..ఇబ్బందులు!
Assembly Elections 2021: కొంప ముంచుతున్న ఎన్నికలు.. కరోనా రెండో వేవ్ పెరగడానికి అదీ ఒక కారణం