- Telugu News Photo Gallery Political photos West bengal assembly election 2021 chief election commission released new guidelines for bengal elections campaign
EC New Guidelines: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి ఈసీ కొత్త రూల్స్.. రాత్రి 7గంటలకే మైకులు బంద్
పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడతలుగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలు పూర్తి కాగా.. శనివారం రోజున ఐదో విడత ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది.
Updated on: Apr 16, 2021 | 10:08 PM

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. బెంగాల్‌లో తదుపరి మూడు దశల ఎన్నికల ప్రచారానికి కొత్త రూల్స్ పెట్టింది.

రాత్రి 7గంటల నుంచి ఉదయం 10గంటల వరకు రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సైలెన్స్ పీరియడ్‌ను 48గంటల నుంచి 72గంటలకు పొడిగిస్తున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులే మాస్క్‌లు, శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

కొవిడ్ రెండో విజృంభణ నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భౌతికదూరం, మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.

ప్రచారం సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించేలా జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించింది.




