Viral Video: నాన్నకు ప్రేమతో.. కుమారుడి ప్రాణాలను కాపాడిన తండ్రి సమయస్ఫూర్తి.. ప్రేమకున్న పవర్‌ ఇదేనేమో..

Viral Video: తన బిడ్డలను కంటికి రెప్పాలా కాపాడుకుంటాడు తండ్రి. అందుకే సంరక్షణ అంటే మనకు ముందుగా తండ్రే గుర్తొస్తాడు. అమ్మ జన్మనిస్తే తండ్రి పిలల్ని ప్రయోజకులను చేసిన పునర్జన్మ ఇస్తాడని చెబుతుంటారు. అయితే...

Viral Video: నాన్నకు ప్రేమతో.. కుమారుడి ప్రాణాలను కాపాడిన తండ్రి సమయస్ఫూర్తి.. ప్రేమకున్న పవర్‌ ఇదేనేమో..
Viral Video Father Saves Son
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 16, 2021 | 9:38 PM

Viral Video: తన బిడ్డలను కంటికి రెప్పాలా కాపాడుకుంటాడు తండ్రి. అందుకే సంరక్షణ అంటే మనకు ముందుగా తండ్రే గుర్తొస్తాడు. అమ్మ జన్మనిస్తే తండ్రి పిలల్ని ప్రయోజకులను చేసిన పునర్జన్మ ఇస్తాడని చెబుతుంటారు. అయితే ప్రయోజకుడిని చేయడం ఏమో కానీ ఓ తండ్రి మాత్రం తన చిన్నారికి మృత్యువు నుంచి రక్షించి నిజంగానే పునర్జన్మనిచ్చాడు. కంటి రెప్పపాటు సమయంలో జరిగే ఘోర ప్రమాదాన్ని ఆపాడు.

వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి ఇంటి ముందు నిల్చున్నాడు. వారిద్దరు ఏదో మాట్లాడుకుంటారు. అయితే అదే సమయంలో ఓ కారు రివర్స్‌ గేర్‌లో వీరిద్దరు ఉన్నవైపే దూసుకొచ్చింది. విపరీతమైన వేగంతో వస్తోన్న ఆ కారును గమనించిన తండ్రి వెంటనే చిన్నారిని చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో ఆ కారు గోడను ఢీకొట్టింది. ఇలా పెద్ద ప్రమాదం తప్పింది. ఎంతో సమయస్ఫూర్తిగా స్పదించి తన కుమారుడి ప్రాణాలను కాపాడిన తండ్రికి సోషల్‌ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అంత వేగంగా వస్తోన్న కారును గుర్తించిన ఆయన సమయస్ఫూర్తికి కారణం ప్రేమకు ఉన్న పవరే అనిపిస్తోంది కదూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

వైరల్‌గా మారిన వీడియో..

Also Read: తిరుపతి ఉప ఎన్నిక అసల అంకానికి అంతా సిద్ధం… కరోనా నిబంధనల నడుమ పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు

Nirav Modi: బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోడీ భారత్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం

Viral Video: ఆటో డ్రైవర్‌గా మారిన బాక్సింగ్‌ ప్లేయర్‌.. క్రీడాకారుల దుస్థితికి ఇదే నిద‌ర్శన‌మంటోన్న నెటిజ‌న్లు..