Viral Video: ఆటో డ్రైవర్‌గా మారిన బాక్సింగ్‌ ప్లేయర్‌.. క్రీడాకారుల దుస్థితికి ఇదే నిద‌ర్శన‌మంటోన్న నెటిజ‌న్లు..

Viral Video: పరిస్థితులు ఎప్పుడెలా మారుతాయో ఎవరికీ తెలియదు. ప్రతిభ ఎంత ఉన్న కొన్ని సమయాల్లో అదృష్టం కలిసిరాక చాలా మంది వెనకపడిపోతుంటారు. మరీ ముఖ్యంగా క్రీడా రంగంలో....

Viral Video: ఆటో డ్రైవర్‌గా మారిన బాక్సింగ్‌ ప్లేయర్‌.. క్రీడాకారుల దుస్థితికి ఇదే నిద‌ర్శన‌మంటోన్న నెటిజ‌న్లు..
Boxer Auto Driver
Follow us

|

Updated on: Apr 16, 2021 | 9:02 PM

Viral Video: పరిస్థితులు ఎప్పుడెలా మారుతాయో ఎవరికీ తెలియదు. ప్రతిభ ఎంత ఉన్న కొన్ని సమయాల్లో అదృష్టం కలిసిరాక చాలా మంది వెనకపడిపోతుంటారు. మరీ ముఖ్యంగా క్రీడా రంగంలో ఓ వెలుగు వెలిగిన వారు కూడా తినడానికి తిండిలేని దుస్థితికి చేరుకున్న పరిస్థితులను చూశాం. వీటికి కారణాలు వెతుక్కుంటూ పోతే ఎన్నో విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. తాజాగా ఓ జాతీయ బాక్సింగ్‌ ప్లేయర్‌ జీవిత కథ ఇలాంటి ప్రశ్న‌లనే తట్టిలేపుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. అబిడ్‌ ఖాన్‌ అనే మాజీ బాక్సింగ్‌ ప్లేయర్‌ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు. ఎంతో మంది ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ ప్లేయర్లను అబిడ్‌ రూపొందించాడు. అంతేకాకుండా అబిడ్‌ అప్పట్లో పంజాబ్‌ యూనివర్సిటీకి ప్రాతినిథ్యం వ‌హించ‌డంతో పాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ లో విద్యనభ్యసించాడు. ఇంతటి చరిత్ర కలిగిన అబిడ్‌ ఇప్పుడు పొట్టకూటి కోసం ఆటో డ్రైవర్‌గా మారాడు. ఆర్థికంగా చితికిపోవడంతో కుటుంబ పోషణకోసం ఆటో నడిపిస్తున్నాడు. తాజాగా ఇయన జీవితానికి సంబంధించిన విషయాలను.. స్పోర్టస్‌ గావన్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో టెలికాస్ట్ చేశారు ఈ వీడియోలో అబిడ్‌ తన బాధన వ్యక్తపరిచాడు. తన క్రీడా అనుభవం తనకు కేవలం ఒక ఉద్యోగం కూడా తెచ్చిపెట్టలేదని.. తన సొంత సంతానాన్ని సైతం క్రీడారంగలోకి రానివ్వట్లేదని వాపోయాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దేశంలో క్రీడాకారుల దుస్థితికి ఇదే ప్రత్యక్ష నిద‌ర్శన‌ం అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇంటర్వ్యూ ప్రోమోలో అబిడ్‌ ఖాన్‌ బాక్సింగ్ చేస్తోన్న వీడియో చూస్తే ఇప్పటికీ తనలో ఆటగాడు అలాగే ఉన్నాడనిపిస్తోంది.

నెట్టింట వైరల్‌గా మారిన వీడియో..

అబిడ్ ఖాన్‌ ఇంటర్వ్యూ..

Also Read: ‘జాతిరత్నాలు’ టీంపై ప్రశంసలు కురిపించిన టీమిండియా క్రికెటర్.. అలా చేయడం కష్టం.. కానీ మీరు సుసాద్యం చేశారంటూ..

జర్నలిస్ట్‏గా రష్మిక.. చెర్రీ, శంకర్ సినిమాలో నటించే ఛాన్స్.. త్వరలోనే సెట్స్ పైకి..

Indian Railways: దేశంలోనే తొలి రైలు నడిచి నేటికి 168 ఏళ్లు..అప్పటి నుంచి ఇప్పటిదాకా.. ఓ లుక్కేద్దాం రండి!

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..