జర్నలిస్ట్‏గా రష్మిక.. చెర్రీ, శంకర్ సినిమాలో నటించే ఛాన్స్.. త్వరలోనే సెట్స్ పైకి..

Rashmika Mandanna: రష్మిక మందన్నా.. ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది.

జర్నలిస్ట్‏గా రష్మిక.. చెర్రీ, శంకర్ సినిమాలో నటించే ఛాన్స్.. త్వరలోనే సెట్స్ పైకి..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2021 | 8:32 PM

Rashmika Mandanna: రష్మిక మందన్నా.. ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బ్లాక్సాఫీసు దగ్గర మంచి విజయం సాధించడంతో.. రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటిస్తూ.. టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం ఈ అమ్మడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. ఇవే కాకుండా బాలీవుడ్‏లోనూ వరుస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక రష్మిక హీరో శర్వానంద్‌తో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో నాయికగా నటిస్తోందితాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసిందట. (RC15 Movie)

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ (Shankar), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో రాబోతున్న సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసినట్లుగా సమాచారం. ఇందులో రష్మిక జర్నలిస్ట్ (Journalist) గా కనిపించబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇప్పటికే శంకర్ ఈ సినిమా స్టోరీని రష్మికకు వివరించగా.. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందట ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా జూలై 15 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కనుందని రామ్‌చరణ్‌ ఇందులో ముఖ్యమంత్రిగా కనిపించనున్నారని ముమ్మరంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు చిత్రంలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో పాటు చిరంజీవి కూడా నటిస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలొస్తున్నాయి.  (Ram Charan Shankar)

Also Read: love Story Movie: చిరు సినిమా డేట్ పై కన్నెేసిన నాగచైతన్య.. ‘లవ్ స్టోరీ’ విడుదల ఆరోజునే..

వివేక్ పరిస్థితి విషమం.. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నా పలువురు సినీ ప్రముఖులు..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‏కు కొవిడ్ పాజిటివ్.. కొనసాగుతున్న చికిత్స.. అధికారికంగా ప్రకటించిన జనసేన టీం..

సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో బేబమ్మకు ఆఫర్ల వెల్లువ.. తమిళ స్టార్ హీరోకు జోడీగా కృతి శెట్టి..