వివేక్ పరిస్థితి విషమం.. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నా పలువురు సినీ ప్రముఖులు..

Vivekh : ప్రముఖ హాస్యనటుడు వివేక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి

వివేక్ పరిస్థితి విషమం.. త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నా పలువురు సినీ ప్రముఖులు..
Vivekh
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2021 | 5:29 PM

Vivekh : ప్రముఖ హాస్యనటుడు వివేక్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వివేక్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు నిర్థారించారు. ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్ కు గుండెపోటు రావడంతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురయ్యింది. ప్రస్తుతం వివేక్ కు ఎక్మో ట్రీట్‌మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికాగా ట్వీట్స్ చేస్తున్నారు.

వివేక్ త్వరగా కోలుకోవాలని నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. “నేను కలుసుకున్న వారిలో వివేక్ అత్యుత్తముడు. అతనికి గుండెపోటు వచ్చిందన్న విషయం ముందుగా నన్ను షాక్ కు గురి చేసింది. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేసింది. వివేక్‏కు చికిత్స చేస్తున్న వైద్యులతో తాను టచ్‌లో ఉన్నట్లు ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయబాస్కర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. వివేక్ త్వరగా కోలుకోవాలని హరీష్ కళ్యాణ్, సోనియా అగర్వాల్, సిబిరాజ్ ట్వీట్స్ చేశారు.

కాగా చెన్నై ఓమందూరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వివేక్ గురువారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వివేక్ కరోనా నుంచి సురక్షితంగా ఉండేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలందరికీ పిలుపునిచ్చారు. ‘కరోనా బారి నుంచి సురక్షితంగా ఉండాలంటే మాస్క్‌లు ధరించడం, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం. టీకా వేసుకోవడం’ ముఖ్యం అని ప్రకటించారు. ఇంటి చిట్కాలు ఎన్ని పాటించినా.. టీకా మాత్రమే కరోనా నుంచి కాపాడుతుందని అన్నారు. ‘వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకదా? అని మీరు నన్ను అడుగొచ్చు. అయితే, టీకా తీసుకున్న వారిపై కరోనా ప్రభావం అంతగా ఉండదు. అందుకే కరోనా టీకా తీసుకోండి’ అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ట్వీట్..

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‏కు కొవిడ్ పాజిటివ్.. కొనసాగుతున్న చికిత్స.. అధికారికంగా ప్రకటించిన జనసేన టీం..

సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో బేబమ్మకు ఆఫర్ల వెల్లువ.. తమిళ స్టార్ హీరోకు జోడీగా కృతి శెట్టి..

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..