Indian Railways: దేశంలోనే తొలి రైలు నడిచి నేటికి 168 ఏళ్లు..అప్పటి నుంచి ఇప్పటిదాకా.. ఓ లుక్కేద్దాం రండి!

మన దేశంలో రైలు బండి కూత వినబడి సరిగ్గా 168 ఏళ్లయింది. 1853 ఏప్రిల్‌ 16న బాంబేలోని బోరి బందర్‌ స్టేషన్‌ నుంచి థానే వరకు మొదటి ప్యాసింజర్‌ రైలు నడిచింది.

Indian Railways: దేశంలోనే తొలి రైలు నడిచి నేటికి 168 ఏళ్లు..అప్పటి నుంచి ఇప్పటిదాకా.. ఓ లుక్కేద్దాం రండి!
Indian Railways
Follow us
KVD Varma

|

Updated on: Apr 16, 2021 | 8:22 PM

Indian Railways: మన దేశంలో రైలు బండి కూత వినబడి సరిగ్గా 168 ఏళ్లయింది. 1853 ఏప్రిల్‌ 16న బాంబేలోని బోరి బందర్‌ స్టేషన్‌ నుంచి థానే వరకు మొదటి ప్యాసింజర్‌ రైలు నడిచింది. ఎడ్లబండి.. కాలి నడక.. గుర్రబగ్గీలు మాత్రమే రవాణా సాధనాలుగా ఉన్న ఆరోజుల్లో రైలు కూత ప్రజలకు కొత్త అనుభూతిని పంచింది. తొలిసారిగా పట్టాలెక్కిన ప్రయాణీకుల రైలులో 14 బోగీలు ఉన్నాయి. ఈ రైలులో 400 మంది ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని సాగించారు. ఇప్పుడు మన రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే శాఖగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజుకు 14 వేలకు పైగా రైళ్ళు నడుస్తున్నాయి. మన తొలి ప్రయాణీకుల రైలుకు 168 ఏళ్లు నిండిన సందర్భంగా మన రైలు ప్రస్థానం ఓ సారి చూస్తె..

బ్రిటిష్ పాలనలో ఇలా..

  • 1880 సం..నాటికి విస్తరించిన రైలు మార్గాల మొత్తం దూరం 14,500 కి.మీ.
  • మొదట్లో బొంబాయి, మద్రాస్, కలకత్తా నగరాలకు మాత్రమే విస్తరించిన రైలు మార్గం
  • 1895 లో సొంత లోకోమోటివ్స్ ను మొదలుపెట్టిన భారత దేశం
  • 1896లో ఉగాండా రైల్వే నిర్మాణానికి తమ ఇంజినీర్లను పంపిన భారత లోకోమోటివ్స్
  • 1901లో ఆంధ్రప్రదేశ్‌ ,అస్సాం,రాజస్ధాన్‌ లో రైల్వే బోర్డుల ఏర్పాటు
  • అప్పట్లో భారత వైస్రాయ్ (లార్డ్ కర్జన్) దగ్గరే అధికార పగ్గాలు ఉండేవి.
  • కామర్స్ డిపార్ట్ మెంటు పర్యవేక్షణలోనే రైల్వే బోర్డు పనిచేసేది.
  • మొదట ముగ్గురు సభ్యులతో రైల్వే బోర్డు ఏర్పాటు చేశారు.
  • ఇందులో ఒక ప్రభుత్వ అధికారి (ఛైర్మెన్), ఇంగ్లండు నుండి ఒక రైల్వే మానేజర్, రైల్వే కంపెనీలలో నుండి ఒక కంపెని ఏజెంట్ సభ్యులుగా ఉండేవారు.
  • భారతీయ రైల్వే చరిత్రలో మొదటిసారిగా రైల్వే సంస్థలు లాభాలను ఆర్జించాయి.
  • 1907లో అన్ని రైల్వే కంపేనీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
  • మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సరికి భారీగా నష్టపోయి ఆర్థికంగా చతికిల పడ్డాయి రైల్వేలు
  • 1920లో రైల్వే సంస్థల నిర్వహణను ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. అప్పుడే ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల పరిధి నుండి రైల్వే ఆర్థిక వ్యవహారాలను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
  • రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అన్ని రైళ్ళను మధ్య-ఆసియాకు ప్రభుత్వం తరలించింది. రైల్వే కర్మాగారాలను ఆయుధ కర్మాగారాలుగా ఉపయోగించడంతో మళ్ళీ రైల్వే రంగం చితికి పోయింది.

స్వాతంత్రానంతరం రైల్వేల స్ధితి ఇదీ..

1947 లో రైల్వేలోని అతిపెద్ద భాగం పాకిస్తాన్ కు తరలి పోయింది. నలభై రెండు వేర్వేరు రైల్వే సంస్థలు, ముప్పై రెండు శాఖలు కలిసి ఏకైక సంస్థగా రూపకల్పన చేసింది భారత ప్రభుత్వం. ఆ సంస్థకు భారతీయ రైల్వే సంస్థగా నామకరణ చేశారు. 1952 లో అప్పటి వరకు వివిధ సంస్థల ఆధీనంలో వున్న రైల్వే మార్గాల ఏకీకరణ చేసి.. మొత్తం ఆరు ప్రాంతీయ విభాగలుగా ఏర్పాటు చేశారు. క్రమేపీ మెరుగుపడ్డ భారత దేశ ఆర్థిక పరిస్థితితొ పాటు రైల్వే స్థితి కూడా బాగుపడటం ప్రారంభం అయింది. అన్ని రైల్వే ఉత్పత్తులూ దేశీయంగానే తయారు చేయడం ప్రారంభించారు. 1985 సం నాటికి బొగ్గుతో నడిచే ఆవిరి యంత్రాలను తొలగించి డీజిల్ తరువాత విద్యుత్ ఇంజన్లను రైళ్లకు అమర్చడం ప్రారంభించారు. 1995 సంలో రైల్వే రిజర్వేషన్ సదుపాయం కంప్యూటరీకరణ చేశారు.

ప్రస్తుత రైల్వే శాఖ తీరు ..

భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికే అధికారం ప్రస్తుతం ఉంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగినవి భారతీయ రైలు మార్గాలు. ప్రతి రోజూ ఒక కోటీ అరవై లక్షల ప్రయాణీకులను గమ్యం చేరుస్తున్న మన రైళ్ళు. రోజూ పది లక్షల మెట్రిక్ టన్నుల సరుకులను కూడా రవాణా చేస్తున్నాయి మన రైళ్లు. 16 లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే రికార్డు పొందిన భారతీయ రైల్వేశాఖ. భారతదేశపు నలుమూలలా విస్తరించి ఉన్న రైలు మార్గాలు. ఈ మార్గాల మొత్తం దూరం సుమారుగా 63,140 కి.మీ (39,233 మైళ్ళు). 2002 నాటికి రైల్వేశాఖ వద్ద 2,16,717 వాగన్లు,39,263 కోచ్ లు, 7,739 ఇంజిన్లు సిద్దంగా ఉన్నాయి. ప్రతి రోజూ 14,444 రైళ్ళను నడుపుతున్న భారత రైల్వే, అందులో 8,702 పాసెంజర్ రైళ్ళు.

Also Read: Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ అలవెన్స్ కూడా..మార్గదర్శకాలు విడుదల!

PM Modi on oxygen: ప్రాణవాయువు కొరత రానివ్వకండి.. ఆక్సిజన్‌ లభ్యత, వినియోగంపై ప్రధాని మోదీ సమీక్ష