AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ అలవెన్స్ కూడా..మార్గదర్శకాలు విడుదల!

కోవిడ్ -19 మహమ్మారి పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఉద్యోగుల కోసం ప్రభుత్వం అనేక నిబంధనలలో మార్పులు చేసింది.

Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ అలవెన్స్ కూడా..మార్గదర్శకాలు విడుదల!
Employees
KVD Varma
|

Updated on: Apr 16, 2021 | 7:48 PM

Share

Employees: కోవిడ్ -19 మహమ్మారి పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఉద్యోగుల కోసం ప్రభుత్వం అనేక నిబంధనలలో మార్పులు చేసింది. ఇది లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పెరిగిన డీఏ , డీఆర్ యొక్క ప్రయోజనాల కోసం 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా 65 లక్షలకు పైగా పెన్షనర్లు ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వారికి తీపి కబురు అందించనుంది. అదేవిధంగా ఉద్యోగుల నైట్ డ్యూటీ అలవెన్స్ పై ప్రభుత్వం త్వరలో మార్గదర్శక సూత్రాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 7 వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం, వ్యక్తిగత, శిక్షణా విభాగం (డిఓపిటి) గత ఆర్థిక సంవత్సరం మొదటి భాగంలో నైట్ డ్యూటీ అలవెన్స్ గురించి మార్గదర్శకాలను జారీ చేసింది. దీనికి సంబంధించి వ్యక్తిగత, శిక్షణ శాఖ (డిఓపిటి) దీనికి మార్గదర్శకాలను జారీ చేసింది. COVID-19 మహమ్మారి దాడిలో అన్ని రకాల అలవెన్స్ లూ నిలిపివేసినా.. జూలైలో డీఏ అలాగే డీఆర్ పెంపుదలపై వస్తున్నా వార్తలు కూడా నైట్ డ్యూటీ అలవెన్సుల పెంపుదలపై స్పష్టతనిస్తాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నైట్ డ్యూటీపై ప్రత్యేక అలవెన్స్ ఇవ్వనున్నారు. ఇది గ్రేడ్ పే ఆధారంగా కాదు. ఇప్పటి వరకు ప్రత్యేక గ్రేడ్ పే ఆధారంగా నైట్ డ్యూటీ అలవెన్స్ లభించింది. కొత్త విధానం ప్రకారం, నైట్ అలవెన్స్ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది అలాగే చేతికి అందే జీతం పెరిగే అవకాశం ఉంటుంది.

ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం నైట్ డ్యూటీ సమయంలో ప్రతి గంటకు 10 నిమిషాల వెయిటేజ్ ఇస్తారు. ఉదయం 10 నుండి ఉదయం 6 వరకు చేసే డ్యూటీని నైట్ డ్యూటీగా పరిగణిస్తారు. ఇందుకోసం నైట్ డ్యూటీ అలవెన్స్ కు బేసిక్ పే సీలింగ్ నెలకు రూ .43,600 జీతం ఆధారంగా నిర్ణయించారు. నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ఒక లెక్కను నిర్ణయించింది. ఈ అలవెన్స్ చెల్లింపు గంటల లెక్కన జరుగుతుంది, ఇది మొత్తం ప్రాథమిక వేతనం అదేవిధంగా డిఏను 200 (బిపి డిఎ / 200) ద్వారా విభజించడం ద్వారా ఇస్తారు. ప్రాథమిక వేతనం, డీఏ ఏడవ వేతన సంఘం ఆధారంగా లెక్కిస్తారు. నైట్ డ్యూటీలో చేరిన రోజున, ప్రాథమిక జీతం అదే ప్రాతిపదికన లెక్కిస్తారు. రాత్రి డ్యూటీ చేసే ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

జూలై 1 నుంచి ఉద్యోగులకు డీఏ పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని, పెండింగ్‌లో ఉన్న మూడు వాయిదాలను పునరుద్ధరించనున్నట్లు ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఏడాది మార్చిలో పార్లమెంటుకు చెప్పారు. ఏదేమైనా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కలవరపెట్టే విషయం ఏమిటంటే, జూలై 1 నుండి డిఏలో ఏదైనా పెరుగుదల ఆ రోజు నుండి మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది అనడం., అంటే మునుపటి కాలానికి డిఏను సవరించకపోవడం వల్ల ఉద్యోగులకు ఎటువంటి బకాయిలు లభించవు.

కోవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని జనవరి 1, 2020, జూలై 1, 2020 మరియు జనవరి 1, 2021 న చెల్లించాల్సిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు విడతలుగా, పెన్షనర్లకు డిఆర్. ఇస్తామని చెబుతూ, రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఠాకూర్ ఇలా అన్నారు “01.07.2021 నుండి రాబోయే డియర్‌నెస్ అలవెన్స్ యొక్క వాయిదాలను విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు, 01.01.2020, 01.07.2020 అలాగే 01.01 నుండి డిఏ రేట్లు అమలులోకి వస్తాయి.”

Also Read: Mamata fire on BJP: బెంగాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులకు బీజేపీయే కారణం… సంచలన వ్యాఖ్యలు చేసిస బెంగాల్ సీఎం మమతా

PM Modi on oxygen: ప్రాణవాయువు కొరత రానివ్వకండి.. ఆక్సిజన్‌ లభ్యత, వినియోగంపై ప్రధాని మోదీ సమీక్ష