Mamata fire on BJP: బెంగాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులకు బీజేపీయే కారణం… సంచలన వ్యాఖ్యలు చేసిస బెంగాల్ సీఎం మమతా

west bengal election 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ - భారతీయ జనతా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 8 దశల్లో జరగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి.

Mamata fire on BJP: బెంగాల్‌లో పెరుగుతున్న కరోనా కేసులకు బీజేపీయే కారణం... సంచలన వ్యాఖ్యలు చేసిస బెంగాల్ సీఎం మమతా
Mamata Benarjee
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 16, 2021 | 6:45 PM

Mamata allegations on BJP: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 8 దశల్లో జరగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి. రేపు శనివారం ఐదు విడత పోలింగ్ జరగనుంది. అయితే, ఈ సందర్బంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రత్యర్థి బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం కోసం భాజపా బయటి వ్యక్తులను రాష్ట్రానికి తీసుకురావడం వల్లే పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులు బెంగాల్‌కు రాకుండా నిషేధించాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు.

నదియా జిల్లాలో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేపట్టిన దీదీ.. బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రధానితో సహా ఇతర బీజేపీ నేతలు రాష్ట్రంలో ప్రచారానికి వస్తే మేం ఏమీ అనుకోం. కానీ, వారి ర్యాలీల్లో పోడియం, వేదికలు సిద్ధం చేయడానికి బీజేపీ బయటి రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఎందుకు తీసుకొస్తున్నారని ఆమె ప్రశ్నించారు. స్థానిక కూలీలను, డెకరేటర్లను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారని, కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకురావడం వల్లే బెంగాల్‌లో కొవిడ్‌ విజృంభిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం వద్దకు వెళ్తానని, బయటి వ్యక్తులు రాష్ట్రానికి రాకుండా చూడాలని కోరతానని మమత అన్నారు.

సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయకుండా తనను అడ్డుకునేందుకే బీజేపీ తనపై దాడి చేయించిందని దీదీ మరోసారి మండిపడ్డారు. అయితే, ప్రజల ఆశీర్వాదబలంతోనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానని అన్నారు. తన కాలి గాయం దాదాపు తగ్గిపోయిందని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు మరోసారి సిద్ధమయ్యానన్నారు దీదీ.

ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్‌లో కరోనా ఉద్ధృతి దృష్టిలో ఉంచుకొని ఇంకా జరగాల్సిన నాలుగు విడతల పోలింగ్‌ను ఒకే రోజు నిర్వహించాలని మమతా బెనర్జీ ఎన్నికల సంఘాన్ని కోరారు. మొత్తం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలకు గత నెల ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. ఒక్క బెంగాల్‌లో మాత్రమే ఇంకా పోలింగ్‌ జరగాల్సి ఉంది.

మిగిలిన విడతల పోలింగ్‌ని ఒకే రోజు నిర్వహించాలన్న ప్రతిపాదనను ఈసీ అంతకుముందే తోసిపుచ్చింది. అయితే, తృణమూల్‌ పార్టీ వర్గాలు ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరపాలన్న ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఓవైపు మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇంత సుదీర్ఘ పోలింగ్‌ ఏమాత్రం సమంజసం కాదని నాయకులు ఆరోపించారు. రోజురోజుకి కేసులు, మరణాల రేటు పెరిగిపోతోందని గుర్తుచేశారు.

Read Also…  PM Modi on oxygen: ప్రాణవాయువు కొరత రానివ్వకండి.. ఆక్సిజన్‌ లభ్యత, వినియోగంపై ప్రధాని మోదీ సమీక్ష