PM Modi on oxygen: ప్రాణవాయువు కొరత రానివ్వకండి.. ఆక్సిజన్ లభ్యత, వినియోగంపై ప్రధాని మోదీ సమీక్ష
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో చుక్కలు చూపిస్తోంది. కల్లోలం సృష్టిస్తున్న కోవిడ్ నేపథ్యంలో దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు.
PM Narendra Modi Review: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌తో చుక్కలు చూపిస్తోంది. కల్లోలం సృష్టిస్తున్న కోవిడ్ నేపథ్యంలో దేశంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక సూచనలు చేశారు. కేంద్రమంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ముఖ్యంగా కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న 12 రాష్ట్రాలైన- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీ, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని మోదీ ఆరా తీసినట్టు పీఎంవో వెల్లడించింది. అలాగే, వచ్చే 15 రోజుల వరకు ఆక్సిజన్ లభ్యత, వినియోగం గురించి సమీక్షించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న 12 రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అధికారులు ప్రధానికి వివరించారు. ప్రస్తుత తీసుకుంటున్న చర్యలు, వైద్య సదుపాయాలపై ప్రధాని నివేదించారు.
దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు ఆక్సిజన్ ట్యాంకర్లు తిరిగేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆక్సిజన్ ఉత్పత్తి గురించి అధికారులు వివరించగా.. ప్రతి ప్లాంట్ సామర్థ్యం ప్రకారం ఉత్పత్తిని పెంచాలని మోదీ సూచించారు. సిలిండర్ ఫిల్లింగ్ ప్లాంట్‌లు అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 24 గంటలు పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన ఆదేశించారు. డ్రైవర్లు షిఫ్టుల విధానంలో ఆక్సిజన్ సరఫరా చేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలకు సేవలందించాలని ప్రధాని మోదీ కోరారు. modi review on medical oxygen situation:
PM interacts with the Governors on Covid-19 situation and Vaccination Drive in the country. https://t.co/9KwHDjmW43
via NaMo App pic.twitter.com/pnjE2QFccd
— PMO India (@PMOIndia) April 14, 2021