Viral: ఖైదీ ప్రేమలో మునిగి తేలుతున్న లేడీ పోలీస్.. ఆ పాడు పని కూడా చేసింది. అంతలోనే షాకింగ్ ట్విస్ట్.!

ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ప్రేమలో పడతామో.? ఎవరికీ తెలియదు.! ఇది చాలా పాత సామెత.. కొన్నిసార్లు ఇలాంటి ప్రేమకథలు విజయవంతం కాగా..

Viral: ఖైదీ ప్రేమలో మునిగి తేలుతున్న లేడీ పోలీస్.. ఆ పాడు పని కూడా చేసింది. అంతలోనే షాకింగ్ ట్విస్ట్.!
Prison Officer
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 17, 2021 | 2:37 PM

ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ప్రేమలో పడతామో.? ఎవరికీ తెలియదు.! ఇది చాలా పాత సామెత.. కొన్నిసార్లు ఇలాంటి ప్రేమకథలు విజయవంతం కాగా.. మరికొన్ని సార్లు అసంపూర్ణంగా మిగిలిపోతాయి. ఇప్పుడు ఇలాంటి ప్రేమకథ ఒకదాని గురించి మాట్లాడుకుందాం.. అందరికీ ఇది షాక్ కలిగిస్తుంది. తన జైలులో ఉన్న ఓ ఖైదీతో ప్రేమలో మునిగి తేలింది ఓ లేడీ పోలీసు.. ఈ ప్రేమ కథలో అసలు ట్విస్ట్ బయటపడేసరికి.. ఆ మహిళా జైలర్‌కు అనుకోని ఇబ్బందులు వచ్చాయి. కటకటాల వెనక్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అసలు ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ సంఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. స్కార్లెట్ ఆల్డ్రిచ్ అనే మహిళా జైలర్ ఓ ఖైదీతో ప్రేమలో పడింది. ఆ ఖైదీతో ఈ లేడీ పోలీస్ ఎంతగా ప్రేమలో పడిందంటే.. తన జాబ్‌ను కూడా రిస్క్ చేసి అతడికి మొబైల్, సిమ్ కార్డులను సైతం అందుబాటులో ఉంచింది. అలాగే ఆ ఖైదీతో చనువుగా ఉంటూ.. లేడీ పోలీస్ పాడు పని చేసింది. అతడి గుర్తుగా.. బ్యారేక్ నెంబర్‌ను తన కాలి పైభాగంపై పచ్చబొట్టు వేయించుకుంది. ఇంత తతంగం నడిపిన ఈమె ఎక్కువ కాలం తన ప్రేమను దాచుకోలేకపోయింది. ఒకానొక సందర్భంలో ఈమెపై పోలీస్ ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. ఈ మహిళా జైలర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించడంతో అసలు నిజం బయటపడింది. ఈ లేడీ పోలీస్ తన క్రిమినల్ బాయ్ ఫ్రెండ్‌కు ప్రేమ లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది.

లేడీ పోలీస్‌కు 10 నెలల జైలు శిక్ష…

అసలు నిజం బయటికి వచ్చిన తర్వాత.. విషయం కోర్టుకు చేరింది. ఖైదీతో సంబంధం పెట్టుకోవడం చట్టానికి విరుద్ధమని కోర్టు తేల్చింది. దీని వల్ల జైలు భద్రతపై అనుమానం రేగుతుందని.. అలాగే నమ్మకం కూడా విచ్ఛిన్నమైందని పేర్కొంది. అదే సమయంలో, స్కార్లెట్.. ఖైదీకి మొబైల్ ఇవ్వడానికి గల కారణం అతడితో మాట్లాడటానికి మాత్రమే తప్ప.. జైలు భద్రతకు ఆటంకం కలిగించడానికి కాదని స్పష్టం చేసింది. అయితే, కోర్టు ఆమె వాదనలను తోసిపుచ్చింది. దీనితో స్కార్లెట్‌కు 10 నెలల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతానికి ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..