తిరుపతి ఉప ఎన్నిక అసల అంకానికి అంతా సిద్ధం… కరోనా నిబంధనల నడుమ పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు

తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికకు అంతా సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జగనుంది.

తిరుపతి ఉప ఎన్నిక అసల అంకానికి అంతా సిద్ధం... కరోనా నిబంధనల నడుమ పోలింగ్‌కు భారీ ఏర్పాట్లు
tirupati by Election
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 16, 2021 | 9:17 PM

Tirupati by election 2021: తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికకు అంతా సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జగనుంది. చిత్తూరు జిల్లాలో మూడు, నెల్లూరు జిల్లాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. మొత్తం 2,470 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 17,10,699 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో కొవిడ్ వేగంగా వ్యాపిస్తున్నందున పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ మార్గదర్శకాలను పాటించేలా ఏర్పాట్లుచేశారు

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక పోలింగ్ సర్వం సిద్ధమైంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2వేల470 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 877 సమస్యాత్మక కేంద్రాలున్నాయి. 1241 కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌, 475 కేంద్రాల్లో వీడియో చిత్రీకరణకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల పర్యవేక్షణకు ముగ్గురు సీనియర్‌ అధికారులు, 816 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. లోక్‌సభ ఉప ఎన్నికకు 716 మందితో కూడిన 8 కంపెనీల కేంద్రబలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొన్నాయి. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. లోక్ సభ స్థానం పరిధిలో 17 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ఉప ఎన్నిక సందర్భంగా తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, సూళ్లురుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో పద్మావతి మహిళా వర్సిటీకి రెండ్రోజులపాటు సెలవులిచ్చారు.

తిరుపతి పార్లమెంట్ లో దాదాపు నెలన్నరపాటు పట్టణాలు, పల్లెలు వివిధ పార్టీల జెండాలతో, నాయకులతో కిటకిటలాడాయి. పట్టణాల్లో రోడ్‌షోలు, పల్లెల్లో ఇంటింటి ప్రచారాలు సాగాయి. వైసీపీ నుంచి మంత్రులు మొహరించగా, టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్‌ సహా పలువురు ముఖ్య నాయకులు సుడిగాలి ప్రచారాలు చేశారు. విమర్శలు చేసుకున్నారు. ఆరోపణలు సంధించుకున్నారు. సవాళ్లు విసురుకున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణను లెక్కకూడా చేయకుండా పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాలను హోరెత్తించాయి.

ఉపఎన్నికలో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది వైసీపీ. పార్లమెంట్ ఎన్నికల పూర్తి వ్యవహారాల బాధ్యతలు పార్టీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు వైఎస్ జగన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు విడివిడిగా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర మంత్రులు కొందరికి తిరుపతి ఉప ఎన్నిక గెలిపించే బాధ్యత కూడా ఇచ్చారు. గత రెండు సంవత్సరాల నుంచి సీఎం జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమ పార్టీని గెలిపిస్తాయని వైసీపీ భావిస్తోంది. నవరత్నాల పేరుతో అమలు చేసిన పథకాలే వైసీపీ అభ్యర్ధిని అఖండ మెజారిటీతో గెలిపిస్తాయని ఆ పార్టీ నమ్మకంతో ఉంది.

సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కరోనా వైరస్ సోకి మరణించడంతో తిరుపతి లోక్‌సభ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక పోలింగ్‌ సమీపిస్తుండటంతో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలందరూ తిరుపతి లోక్‌సభ పరిధిలో మకాం పెట్టారు. నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా ఇతరత్రా నేతలందరు ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీ నుంచి డాక్ట‌ర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ ర‌త్న‌ప్ర‌భ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ బ‌రిలో ఉన్నారు.

వరుస ఓటములతో ఉన్న తెలుగుదేశం ఎలాగైన తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు విసృతంగా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం తరుపున పోటీ చేస్తున్న పనబాక లక్ష్మీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ , టీడీపీ ఆగ్రనేతలు తదితరులు మద్దతుగా తిరిగారు.

మరోవైపు, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మాస్క్ లేని వారికి ప్రవేశాన్ని నిషేధించారు. శానిటైజర్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఓటు వేసేందుకు వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా సూచికలను ఏర్పాటు చేశారు. అలాగే కోవిడ్ పై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు, బోర్డులు కూడా ఉంచారు. ఓటర్లు గుమిగూడకుండా, గంటల తరబడి క్యూలో నిల్చొనే సమస్య రాకుండా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఎన్నికల నిర్వహణకు గాను 5,054 మంది పోలింగ్ సిబ్బందిని నియమించింది ఎన్నికల సంఘం. ఇందులో పి.ఓ లు 1,266 మంది ఏ.పి.ఓ లు 1,266 మంది ఓ.పి.ఓ లు 2,522 మంది, మైక్రో అబ్జర్వర్లు 451 మంది, సెక్టోరల్ ఆఫీసర్లు 111 మంది, రూట్ ఆఫీసర్లు 111 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 377 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించగా అందులో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 83, శ్రీకాళహస్తి కి సంబంధించి 136, సత్యవేడుకు సంబంధించి 158 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.

ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 2,913 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పోలీసులు ఉన్నతాధికారి తెలిపారు. ఇందులో 10 మంది అదనపు ఎస్.పి లు, 27 మంది డి.ఎస్.పి లు, 66 మంది సి.ఐ లు 169 మంది ఎస్.ఐ లు,697 మంది ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, 1,519 మంది పి.సీ లు 234 మంది ఎస్.టి.ఎఫ్ సిబ్బంది 191 మంది హోమ్ గార్డ్ లు, 716 మ ది సి.ఐ.ఎస్.ఎఫ్ అధికారులు, 105 మంది రూట్ మొబైల్స్, 27 క్వూ ఆర్ టీమ్స్, 13 సైక్లింగ్ ఫోర్స్, 8 ఎస్.ఎస్.టి టీమ్స్, 8 ఫ్లయింగ్ స్క్వాడ్, 8 ఎం.సి.సి బృందాలు, 19 ఇంటర్వెన్షన్, మహిళా ఇంటర్వెన్షన్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Read Also…  ఆన్‌‌లైన్ గిఫ్ట్స్ పేరుతో అమాయకులకు టోకరా.. అడ్డంగా బుక్కైన ముఠా.. పట్టుబడ్డ వారంతా 35 ఏళ్లలోపే..!

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్