Nirav Modi: బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోడీని భారత్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం

ఎట్టకేలకు ఒక మోసకారి వ్యాపారిని భారత్ రప్పించేందుకు మార్గం సుగమం అయింది. ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది.

Nirav Modi: బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోడీని భారత్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం
Follow us
KVD Varma

| Edited By: Subhash Goud

Updated on: Apr 16, 2021 | 10:30 PM

Nirav Modi: ఎట్టకేలకు ఒక మోసకారి వ్యాపారిని భారత్ రప్పించేందుకు మార్గం సుగమం అయింది. ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసి.. యూకే పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించడానికి బ్రిటన్ అంగీకరించింది. యూకే హోం మినిస్టర్‌ నీరవ్ మోడీని ఇండియాకు అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సీబీఐ చెప్పింది. ఫిబ్రవరి నెలలోనే అక్కడి కోర్టు అతనిని స్వదేశం పంపించాలని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ దేశ ప్రభుత్వం దీనికి అంగీకరించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)ను దాదాపు రూ. 14వేల కోట్ల మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోడీ ఇక్కడికి రాకుండా ఉండేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అయితే, అతని ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. తన మానసిక స్థితి సరిగా లేదని ఒకసారి..భర్త లో న్యాయం జరగదని ఒకసారి ఇలా ప్రతిసారి బ్రిటన్ కోర్టుకు విన్నపాలు చేసుకుంటూ వచ్చారు. కానీ, ఆయన ప్రయత్నాలను బ్రిటన్ కోర్టు తోసిపుచ్చింది. మనీలాండరింగ్ విషయంలో భారత్ చూపిస్తున్న ఆధారాలు సరిపోతాయనీ, వెంటనే ఆయనను ఇండియాకు అప్పచేప్పాలనీ ఫిబ్రవరి నెలలో తీర్పు ఇచ్చింది. తప్పుడు ఎల్‌వోయూలతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ని నీరవ్‌ మోదీ మోసగించిన సంగతి 2018 జనవరి వెలుగుచూసింది. సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అదే ఏడాది రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్సమెంట్‌ డైరెక్టరేట్‌ ఈ కేసు దర్యాప్తులో భాగంగా నీరవ్‌కు చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2018 డిసెంబర్‌లో నీరవ్‌ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్‌వర్త్‌ జైల్లో నీరవ్‌ ఉంటున్నాడు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ బ్రిటన్‌ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. తాజాగా అతన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Also Read: Viral Video: ఆటో డ్రైవర్‌గా మారిన బాక్సింగ్‌ ప్లేయర్‌.. క్రీడాకారుల దుస్థితికి ఇదే నిద‌ర్శన‌మంటోన్న నెటిజ‌న్లు..

Indian Railways: దేశంలోనే తొలి రైలు నడిచి నేటికి 168 ఏళ్లు..అప్పటి నుంచి ఇప్పటిదాకా.. ఓ లుక్కేద్దాం రండి!