అన్నకు తగ్గ తమ్ముడు, వజ్రాల వర్తకుడు నీరవ్ మోడీ సోదరుడిపై న్యూయార్క్ లో కేసు, 10 లక్షల డాలర్ల విలువైన వజ్రాలు ‘మాయం’ !
ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన ఫ్రాడ్ స్టర్ నీరవ్ మోడీ సోదరుడు నెహాల్ మోడీ కూడా అన్నబాటలోనే ప్రయాణించినట్టు కనిపిస్తోంది. ఇతనిపై న్యూయార్క్ కోర్టులో కేసు..
ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన ఫ్రాడ్ స్టర్ నీరవ్ మోడీ సోదరుడు నెహాల్ మోడీ కూడా అన్నబాటలోనే ప్రయాణించినట్టు కనిపిస్తోంది. ఇతనిపై న్యూయార్క్ కోర్టులో కేసు నమోదయింది. (నెహాల్ కూడా ఇండియాలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నాడు). 10 లక్షల డాలర్ల విలువైన వజ్రాలను కాజేసి ఓ కంపెనీని మోసం చేశాడట . క్రెడిట్ టర్మ్స్ పై ఎల్ ఎల్ డీ డైమండ్స్ అనే సంస్థ నుంచి 2.6 మిలియన్ డాలర్ల విలువైన జెమ్స్ ను దొంగచాటుగా చేజిక్కించుకోవడానికి నెహాల్ తప్పుడు పత్రాలు సృష్టించినట్టు వెల్లడైంది. ఈ మేరకు న్యూయార్క్ సుప్రీంకోర్టులో విచారణను ఎదుర్కోబోతున్నాడు. ఈ నిందితుడు మరో సంస్థ (కోస్ట్ కో హోల్ సేల్ కార్పొరేషన్) తో వ్యాపారలావాదేవీలు నెరపడంతో బాటు ఎల్ ఎల్ డీ డైమండ్స్ కంపెనీని అప్రోచ్ అయి..దాదాపు 80 లక్షల డాలర్ల విలువైన వజ్రాలు కావాలని కోరాడని డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది. అయితే ఆ తరువాత తప్పుడు పత్రాలు సృష్టించి ఎల్ ఎల్ డీ సంస్థకు అబధ్ధాలు చెప్పి క్రెడిట్ పై వీటిని కొన్నాడని తెలిసింది. వాటిని షార్ట్ టర్మ్ లోన్ కింద కుదువపెట్టాడట.ఇలా రెండు కంపెనీలను నెహాల్ మోడీ మోసగించాడు.