మోడీ సడన్ టూర్… ఢిల్లీలోని రకాబ్‌గంజ్ గురుద్వారాను దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ…

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని రకాబ్‌గంజ్ గురుద్వారాను డిసెంబర్ 20న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గురు తేగ్‌బహదూర్ సింగ్‌కు నివాళులు అర్పించారు.

మోడీ సడన్ టూర్... ఢిల్లీలోని రకాబ్‌గంజ్ గురుద్వారాను దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 20, 2020 | 11:40 AM

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని రకాబ్‌గంజ్ గురుద్వారాను డిసెంబర్ 20న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గురు తేగ్‌బహదూర్ సింగ్‌కు నివాళులు అర్పించారు. కాగా, ప్రధాని సందర్శన కోసం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. అయితే అకస్మాత్తుగా గురుద్వారాను సందర్శించి ప్రధాని అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్లో గురు తేగ్ బహదూర్ సింగ్ సేవలను కొనియాడారు. గురు తేగ్ బహదూర్ సింగ్ జీవితం ఎంతో ఆదర్శనీయమని అన్నారు. ఆయన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని తెలిపారు. గురు తేగ్ బహదూర్ తరహాలోనే సమాజాభివృద్ధికి కృషి చేస్తామని ప్రధాని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దేశంలో జరుగుతున్న ఆందోళనలోనూ సిక్కు రైతులే ముందున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ముఖ్యమైన గురుద్వారాల్లో ఒకటైన రకాబ్‌గంజ్ గురుద్వారాను ప్రధాని సందర్శించుకోవడం ఆసక్తికరంగా మారింది.

Latest Articles
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
చింతపండు బస్తాలే అనుకున్నారు.. లోపల చెక్ చేయగా...
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
పోలా..అదిరిపోలా..4 చక్రాలతో ఎలక్ట్రిక్ బైక్.. వీడియో చూస్తే ఫిదా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా