ఆన్‌‌లైన్ గిఫ్ట్స్ పేరుతో అమాయకులకు టోకరా.. అడ్డంగా బుక్కైన ముఠా.. పట్టుబడ్డ వారంతా 35 ఏళ్లలోపే..!

ఆన్‌‌లైన్ గిఫ్ట్స్ పేరుతో అమాయకులకు టోకరా.. అడ్డంగా బుక్కైన ముఠా.. పట్టుబడ్డ వారంతా 35 ఏళ్లలోపే..!
Online Cheating Gang Arrest In Warangal

ఆన్‌‌లైన్ గిఫ్ట్స్ పేరుతో అమాయకులకు ఎరవేసి దర్జాగా మోసాలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.

Balaraju Goud

|

Apr 16, 2021 | 8:21 PM

Online Cheating Gang: ఆన్‌‌లైన్ గిఫ్ట్స్ పేరుతో అమాయకులకు ఎరవేసి దర్జాగా మోసాలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.14లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులను రిమాండ్‌కు పంపారు.. అరెస్టయిన వారంతా 35 ఏళ్ల లోపువారే, అంతేకాదు వారంతా ఉన్నత విద్యావంతులు కావడం విశేషం.

అసలే కరోనా కాలం.. చేతిలో చిల్లి గవ్వలేదు.. కానీ మెదడు నిండా బోలెడన్ని క్రిమినల్ ఆలోచనలు.. ఇంకేముంది… వారి ఒంకరి ఆలోచనలు ఆచరణలో అమలు పర్చిన ఓ గ్యాంగ్ కొత్త తరహా మోసాలకు తెర లేపారు. ఆన్‌లైన్ గిఫ్ట్‌ల పేరుతో ఆమాయకులకు ఎరవేసి నిలువు దోపిడీలకు పాల్పడుతున్నారు. కష్టపడకుండా ఇంట్లో కూర్చొని కరెన్సీ కట్టలు కూడాబెట్టిన ఆ గ్యాంగ్ పాపం పండింది.. ఇంకేముంది కటకటాల పాలయ్యారు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలకత్తా కు చెందిన వారితో ఈ దందాకు తెర లేపారు. మంచిర్యాల జిల్లాకు చెందిన యువకులు ఓ ముఠాగా ఎర్పడ్డారు. ఈ గ్యాంగ్ ఆన్‌లైన్ లో మీకు ఓ గిఫ్ట్ వచ్చిందని అందమైన అమ్మాయి స్వరం చేత అమాయకులకు ఎర వేస్తారు. లక్షలాది రూపాయల విలువ చేసే బహుమతులు గెలుచుకున్నారని నమ్మించి ఓ గిఫ్ట్ కూపన్‌ను పంపిస్తారు. లక్కీ డ్రాలో వారిపేరుతో లక్షలాది రూపాయల విలువ చేసే గిఫ్ట్ వచ్చిందని నమ్మిస్తారు.. ఎలాంటి వారినైనా బురిడీ కొట్టించడం కోసం ఓ స్క్రాక్ కార్డ్ కూడా వారి అడ్రస్‌కు పంపిస్తారు..ఆ గిఫ్ట్ మీకు చేరాలంటే కంపెనీ నిబంధనల ప్రకారం కొన్ని ట్యాక్సీలు కట్టాలని వేలాది రూపాయలు వారి అకౌంట్లోకి వేయించుకుంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది అమాయకులకు ఎరవేసి లక్షలాది రూపాయలు కాజేసిన ఈ ముఠా ఎట్టకేలకు వరంగల్ పోలీసుల చేతికి చిక్కింది.13మంది సభ్యులు కలిగిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.14 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా అంతా మంచిర్యాల జిల్లాకు చెందినవారే… వీరిలో ఇప్ప రాజ్ కుమార్ అనే ప్రధాన నిందితుడి తో పాటు, దామోదర్ గౌడ్ అలియాస్ దాము బాయ్, దాసరి హరీష్ గౌడ్, మేకల అదిత్య, ఆకునూరి శ్రవణ్ కుమార్, గంగాధర్ రాకేశ్, పోరండ్ల విజయ్, ఈద రవికుమార్, దార్శ గణేష్, సిరికొండ వినోద కుమార్, వోల్లల ప్రవీణ్, గంగాధరి రాంచందర్, ఆడేపు సిద్ధార్డ్ అనే 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.కలకత్తాకు చెందిన ప్రజీత్, సంజీవ్, ప్రకాశ్ అనే మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు.

కలకత్తా కు చెందిన వారితో ఈ దందాకు తెర లేపారు..రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మందిని నిండా ముంచారు.. కొంతమంది పోలీసు అధికారులు కూడా వీరి బుట్టలో చిక్కారు. పక్కా ప్లాన్‌తో ఈ ముఠాను పట్టుకున్న వరంగల్ పోలీసులు.. వీరి వద్ద రూ.14లక్షలకు పైగా నగదు, 15 సెల్ ఫోన్లు, ఆన్ లైన్ గిఫ్ట్ ఓచర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అరెస్టయిన 13 మంది 35ఏళ్ల లోపు వారే కావడం విశేషం. వీరిలో సగం మంది బీటెక్ పూర్తి చేసిన వారు ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది .ఈ ఆన్‌లైన్ మోసాలకు కలకత్తా నగరాన్ని స్థావరంగా ఏర్పాటు చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు..

Read Also…  Corona Second Wave: కొనసాగుతోన్న కరోనా విలయతాండవం.. దేశ వ్యాప్తంగా కేసులు అధికంగా నమోదవుతోన్న టాప్‌ పట్టణాలు ఇవే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu